Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫైనల్ పోరుకు రెడీ - ఎవరొస్తారో రండి ..!!

 Pakistan team led by Babar Azam, reaches Melbourne to play final match of T20 World Cup 2022

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఇంకాసేపట్లో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. కొద్దిసేపటి కిందటే టాస్ పడింది. ఇంగ్లాండ్ జట్టు కేప్టెన్ జోస్ బట్లర్- టాస్ గెలుచుకున్నాడు. తొలుత ఫీల్డింగ్ చేయడానికే మొగ్గు చూపాడు. ఛేజింగ్ చేసే అవకాశాన్ని భారత్‌కు ఇవ్వలేదు. ఛేజింగ్‌లో టీమిండియా ఎంత దూకుడుగా ఆడుతుందో బాగా తెలిసిన అనుభవం ఉండటం వల్లేనేమో- టాస్ గెలిచిన జోస్.. తొలుత ఫీల్డింగ్‌నే ఎంచుకున్నాడు.

కొంపముంచిన కేఎల్..

కొంపముంచిన కేఎల్..

ఈ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్ నాలుగో బంతికి కేెఎల్ రాహుల్ బలి అయ్యాడు. క్రిస్ వోక్స్ విసిరిన గుడ్ లెంగ్త్ బంతిని అర్థం చేసుకోవడంలో విఫలం అయ్యాడు. ఎలా ఆడాలో తెలియక తికమక పడ్డాడు. ఆ గ్యాప్‌లో బంతి అతని బ్యాట్‌ ఎడ్జ్‌ను ముద్దాడి నేరుగా వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతుల్లో వాలింది. అప్పటికి జట్టు స్కోర్ 9 పరుగులే. అనంతరం విరాట్ కోహ్లీ క్రీజ్‌లోకొచ్చాడు. తనదైన శైలిలో ఆడుతున్నాడు.

పాకిస్తాన్‌తో..

భారత్-ఇంగ్లాండ్ మధ్య అడిలైడ్ ఓవల్‌లో జరగబోతోన్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం ఫైనల్స్ ఆడుతుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో పాకిస్తాన్‌తో తలపడుతుంది. అనూహ్య పరిస్థితులు, అనేక ట్విస్టుల తరువాత పాకిస్తాన్.. ఫైనల్‌లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సూపర్ 12 దశలో నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా దారుణంగా ఓడిపోవడం పాకిస్తాన్‌కు ప్లస్ పాయింట్. అదే సమయంలో బంగ్లాదేశ్‌ను మట్టి కరిపించింది.

మెల్‌బోర్న్ చేరిన పాక్..

మెల్‌బోర్న్ చేరిన పాక్..

బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు- ఇప్పటికే ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఆడటానికి సిడ్నీ నుంచి బయలుదేరిన ఈ జట్టు మెల్‌బోర్న్ చేరుకుంది. కేప్టెన్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, షహీన్ షా అఫ్రిది, హైదర్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, షాదబ్ ఖాన్, షాన్ మసూద్.. ఇలా జట్టు మొత్తం మెల్‌బోర్న్‌కు చేరింది. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఈ ఆదివారం తలపడుతుంది. ఫైనల్‌లో పాకిస్తాన్ ప్రత్యర్థి ఎవరనేది ఈ సాయంత్రానికి తేలిపోతుంది.

 అనిశ్చితికి మారుపేరుగా..

అనిశ్చితికి మారుపేరుగా..

పాకిస్తాన్ క్రికెట్ జట్టు అనిశ్చితికి మారుపేరుగా చెబుతుంటారు. ఎప్పుడెలా ఆడుతుందో తెలియదని అంటుంటారు. అలాంటి ఆటతీరును మళ్లీ ప్రదర్శించిందా టీమ్. సూపర్ 12 దశలోనే ఇంటికి వెళ్లాల్సిన దశ నుంచి ఫైనల్‌కు చేరుకోవడం అంటే మాటలు కాదు. సూపర్ 12 దశలో నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఘోర పరాజయంపాలు కావడాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. బంగ్లాదేశ్‌ను ఓడించి, సెమీస్ చేరింది. సెమీ ఫైనల్‌లో బలమైన న్యూజిలాండ్‌పై తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.

Story first published: Thursday, November 10, 2022, 14:17 [IST]
Other articles published on Nov 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+