Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

NZ vs PAK: పాకిస్తాన్ జట్టుకు బిగ్ షాక్!

NZ vs PAK: ఇటీవల పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ దేశంలో పర్యటించింది. ఈ పర్యటనలో ఘోర పరాజయాలను పాక్ మూటగట్టుకుంది. ఈ టూర్‌లో పాకిస్తాన్ టీ20, వన్డే సిరీస్‌లలో ఓటమిని చవిచూసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ 4-1 తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. దీని తర్వాత పాకిస్థాన్ 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. వన్డే సిరీస్ లో ఓటమి తర్వాత పాకిస్తాన్ ఆటగాడు ఖుష్దిల్ షా అభిమానులతో గొడవకు దిగాడు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదం తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ జట్టు మరో బిగ్ షాక్ తగిలింది. మూడో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా మొత్తం జట్టుకు భారీ జరిమానా విధించబడింది.

మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్ లో న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్తాన్ జట్టుకు మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించారు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్లు నిర్ణీత సమయం కంటే నెమ్మదిగా బౌలింగ్ చేశారు. దీని కారణంగా మొత్తం జట్టు బాధపడాల్సి వచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ పాకిస్తాన్ జట్టుకు మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధించింది. ఈ నిర్ణయం ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో పాక్ జట్టుకు జరిమానా విధించినట్లు ఐసీసీ సోమవారం తెలిపింది. "స్లో ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి ఆటగాళ్లకు ఆర్టికల్ 2.22 ప్రకారం వారి జట్టు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయని ప్రతి ఓవర్ కు వారి మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధించబడుతుంది" అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

Pakistan Team Fined Due to Slow Over Rate in Third ODi Against New Zealand

పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తన స్లో ఓవర్ రేట్ తప్పును అంగీకరించాడు. ఐసీసీ ఇచ్చిన శిక్షను కూడా అంగీకరించాడు. ఇప్పుడు ఈ విషయంలో ఎటువంటి అధికారిక విచారణ అవసరం లేదు. ఫీల్డ్ అంపైర్లు క్రిస్ బ్రౌన్, పాల్ రీఫెల్, థర్డ్ అంపైర్ మైఖేల్ గోఫ్, ఫోర్త్ అంపైర్ వేన్ నైట్స్ కలిసి అభియోగాలు మోపిన తర్వాత రిజ్వాన్ అంగీకరించాడు.

Story first published: Monday, April 7, 2025, 18:49 [IST]
Other articles published on Apr 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+