T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొనడంపై గత కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగిస్తున్న పాకిస్థాన్ ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించినందుకు నిరసనగా తాము కూడా తప్పుకుంటామని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హెచ్చరించినప్పటికీ.. ఐసీసీ కఠిన ఆంక్షల హెచ్చరికతో పాక్ దిగొచ్చింది. ఆదివారం మధ్యాహ్నం సల్మాన్ అలీ ఆఘా సారథ్యంలో 15 మంది సభ్యుల జట్టును పీసీబీ ప్రకటించింది.
ఈ జట్టులో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది జట్టులోకి తిరిగి వచ్చారు.స్టార్ పేసర్ హరీస్ రౌఫ్‌ను జట్టు నుంచి తప్పించారు. అతని ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్ కారణాల దృష్ట్యా సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కు చోటు దక్కలేదు. అతని స్థానంలో ఉస్మాన్ ఖాన్ ప్రధాన కీపర్‌గా వ్యవహరించనున్నారు.

సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, ఖ్వాజా మొహమ్మద్ నాఫే (కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీం షా, సాహిబ్‌జాదా ఫర్హాన్ (కీపర్), సైమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (కీపర్), ఉస్మాన్ తారిక్.
పాకిస్థాన్ తన గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోని కొలంబో వేదికగా ఆడనుంది.
ఫిబ్రవరి 7: పాకిస్థాన్ vs నెదర్లాండ్స్
ఫిబ్రవరి 10: పాకిస్థాన్ vs యూఎస్‌ఏ
ఫిబ్రవరి 15: భారత్ vs పాకిస్థాన్ (మహా సమరం)
ఫిబ్రవరి 18: పాకిస్థాన్ vs నమీబియా
ఒకవేళ పాక్ తప్పుకుంటే ఆ దేశంపై క్రికెట్ పరంగా నిషేధం విధించడంతో పాటు పీఎస్ఎల్ (PSL) కు విదేశీ ప్లేయర్ల ఎన్ఓసీలను నిలిపివేస్తామని ఐసీసీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ ఒత్తిడితోనే పాక్ ప్రభుత్వం జట్టును పంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి 15న కొలంబోలో జరగబోయే భారత్-పాక్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు లైన్ క్లియర్ అయింది.