
ఇంగ్లండ్ గెలిస్తే.. పాక్‌కు ద్వారాలు మూసుకున్నట్టే
భారత్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే.. పాకిస్తాన్ తన కిట్‌బ్యాగులను సర్దుకోవచ్చు. డ్రెస్సింగ్ రూమ్‌లను ఖాళీ చేసుకోవచ్చు. సెమీ ఫైనల్‌లో అడుగు పెట్టాలనుకునే ఆ దేశ క్రికెట్ జట్టు ఆశలు తడారిపోతాయి. ఎంచక్కా ఇంటిదారి పట్టవచ్చు. వచ్చేనెల 5వ తేదీన లండన్‌లోని లార్డ్స్ మైదానంలో బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ ఇక పాకిస్తాన్‌కు నామమాత్రమే అవుతుందే తప్ప.. సెమీ ఫైనల్ అవకాశాలను కల్పించలేదు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాత్రమే కాదు.. ఆ దేశ ప్రజలు కూడా- భారత్ ఇక ఇంగ్లండ్ జట్టుపై తన విశ్వరూపాన్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నారు.

పాక్ జుట్టు.. కోహ్లీసేన చేతిలో
పాకిస్తాన్‌ను ఇంటి దారి పట్టించాలా? లేక సెమీ ఫైనల్ వైపు దారి చూపించాలా? అనేది ఇక పూర్తిగా కోహ్లీసేన చేతుల్లోనే ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. పాకిస్తాన్ భవితవ్యం టీమిండియా చేతుల్లో ఉంది. ఆ జట్టు ప్రపంచకప్ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లాలా? లేదా? అనేది పూర్తిగా టీమిండియా గుప్పిట్లో ఉంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో మరికొన్ని గంటల్లో ఆరంభం కాబోయే మ్యాచ్ ఇది. దీనికోసం రెండు జట్లూ కసరత్తు పూర్తి చేశాయి. ఇంగ్లండ్‌కు చావో, రేవోగా మారిన మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడితే.. పాకిస్తాన్‌కు సెమీఫైనల్‌కు వెళ్లిపోతుంది. అదే ఇంగ్లండ్ గెలిస్తే.. ఆ జట్టుకు సెమీస్ ఛాన్స్ లభిస్తుంది. స్వదేశంలో, సొంత గడ్డపై జరిగే ప్రపంచకప్ టోర్నమెంట్‌లో అవమానకరంగా నిష్క్రమించకూడదనే పట్టుదల, కసి ఇంగ్లండ్ జట్టులో కనిపిస్తోంది.

ఇండియా ఓడినప్పటికీ..
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓడినప్పటికీ.. పెద్దగా సంభవించే నష్టమేమీ లేదు. మెరుగైన రన్‌రేట్ ఇప్పటికే భారత్ ఖాతాలో ఉంది. పైగా ఇంకా రెండు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. టీమిండియా తన తదుపరి మ్యాచ్‌లను శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ.. ఈ రెండింట్లో ఏ ఒక్కదాన్ని నెగ్గినా టీమిండియా రాచమార్గంలో సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇంగ్లండ్ సెమీఫైనల్ ప్రస్థానం ఎక్కడైతే ఆరంభమౌతుందో.. అక్కడే పాకిస్తాన్ కథ ముగిసిపోతుంది. ఇలాంటి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. పాకిస్తాన్ జట్టు జుట్టు ప్రస్తుతం కోహ్లీసేన చేతుల్లో ఉంది. టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా సెమీస్ దిశగా అడుగులు వేస్తుంటే, కివీస్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే ఓడింది. మరోవైపు ఇంగ్లాండ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఈ రెండు జట్లను ఎలా ఎదుర్కొంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది.

ఇంగ్లండ్ కల ఈ సారైనా..
సొంత గడ్డపై తొలిసారి టైటిల్ గెలవాలన్న ఇంగ్లాండ్ కల ఈసారైనా నెరవేరుతుందో లేదో చూడాలి మరి. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడిన ఇంగ్లాండ్ జట్టు ఎనిమిది పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్థాన్ కూడా చెరో ఏడు మ్యాచ్‌లు ఆడి, చెరో ఏడు పాయింట్లతో పాయింట్ల పట్టికలో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆడే రెండు మ్యాచ్‌లు ఎంతో కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో 'ఆదివారం జరిగే మ్యాచ్‌లో మీరు ఏ జట్టు గెలవాలని కోరుకుంటున్నారు' అని పాకిస్థాన్ అభిమానులను ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజిర్ హుస్సేన్ ట్విటర్ ద్వారా ప్రశ్నించాడు. ఈ ట్వీట్‌కు పాకిస్థాన్ అభిమానులు పెద్ద సంఖ్యలో స్పందించారు.


Click it and Unblock the Notifications












