Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PSL Final: ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి విజయం (Video)

పాకిస్థాన్ సూపర్ లీగ్ -2024లో ఇస్లామాబాద్ యునైటెడ్ ఛాంపియన్‌గా నిలిచింది. ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఇస్లామాబాద్ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. కరాచీ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్‌లో రెండు వికెట్ల తేడాతో గెలిచి ఇస్లామాబాద్ ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను అందుకుంది. పాయింట్ల పట్టికలో టాపర్‌‌గా నిలిచిన ముల్తాన్ సుల్తాన్స్‌కు నిరాశే మిగిలింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 159 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ (57; 40 బంతుల్లో) టాప్ స్కోరర్. ముల్తాన్ 14 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ఉస్మాన్‌తో కలిసి కెప్టెన్ రిజ్వాన్ (26; 26 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ ఇస్లామాబాద్ బౌలర్లు పుంజుకుని వికెట్లు సాధిస్తూ సుల్తాన్స్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇమాద్ వసీమ్ అయిదు వికెట్లతో సత్తాచాటాడు.

Pakistan Super League 2024 Champions Multan Sultans

అనంతరం ఛేదనలో ఇస్లామాబాద్ యునైటెడ్ 20 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అయితే ఆది నుంచి ఇస్లామాబాద్ వికెట్లు కోల్పోయింది. మరోవైపు సహచరులు వెనుదిరుగుతన్నా ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (50; 32 బంతుల్లో) టార్గెట్‌ను కరిగించాడు. ఈ క్రమంలో అర్ధశతకం కూడా సాధించాడు. కానీ హాఫ్‌సెంచరీ తర్వాత గప్తిల్ రనౌటయ్యాడు.

ఆ తర్వాత ముల్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇస్లామాబాద్ విజయ సమీకరణం 18 బంతుల్లో 31 పరుగులుగా మారింది. నసీమ్ షా (17; 9 బంతుల్లో), ఇమాద్ వసీమ్ (19; 17 బంతుల్లో) చెలరేగడంతో 18, 19 ఓవర్లలో 23 పరుగులు వచ్చాయి. అయితే ఆఖరి ఓవర్ ఉత్కంగా మారింది. గెలుపుకు 8 పరుగులు అవసరమవ్వగా తొలి నాలుగు బంతులకు ఏడు పరుగులు వచ్చాయి. కానీ అయిదో బంతికి నసీమ్ షా ఔటయ్యాడు. చివరి బంతికి ఒక్క పరుగు కావాల్సిన తరుణంలో క్రీజులోకి వచ్చిన హునైన్ షా బౌండరీ బాది జట్టును గెలిపించాడు.

Story first published: Tuesday, March 19, 2024, 11:02 [IST]
Other articles published on Mar 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+