టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - గెలిచిన ఆనందం కూడా ఆవిరి..!!

క్రైస్ట్‌చర్చ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ ఆరంభం కావడానికి ముందు పాకిస్తాన్‌కు బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో ముక్కోణపు సిరీస్‌ను సొంతం చేసుకున్న ఆనందం కూడా ఆ జట్టుకు లేకుండా పోయింది. పాకిస్తాన్ బెస్ట్ ఫినిషర్ ఆసిఫ్ అలీ గాయపడ్డాడు. మ్యాచ్ కొనసాగుతుండగా మధ్యలోనే గ్రౌండ్‌ను వీడాల్సి వచ్చింది. గాయం తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది తెలియరాలేదు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
163 పరుగులకే..
న్యూజిలాండ్-బంగ్లాదేశ్ పాల్గొన్న ఈ ముక్కోణపు సిరీస్‌కు న్యూజిలాండ్ ఆతిథ్యాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు- పాకిస్తాన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్లను నష్టపోయి 163 పరుగులు చేసింది. అలెన్-12, కాన్వే-14 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
కుప్పకూలిన బ్యాటింగ్
నసీం షా బౌలింగ్‌లో మహ్మద్ నవాజ్‌కు క్యాచ్ ఇచ్చి అల్లెన్ అవుట్ కాగా, హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో డెవాన్ కాన్వే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన కేప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక్కడే క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. గ్లెన్ ఫిలిప్స్-29, మార్క్ ఛాప్‌మన్- 25, జిమ్మీ నీషమ్- 17, ఈష్ సోధి-2 పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లల్లో నసీం షా, హ్యారిస్ రవూఫ్ రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు. షాదబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
గాయపడ్డ ఆసిఫ్..
అంతా బాగానే ఉన్నప్పటికీ- ఫీల్డింగ్ చేస్తోన్న సమయంలో ఆసిఫ్ అలీ గాయపడ్డాడు. మహ్మద్ వసీం జూనియర్ బౌలింగ్‌లో కివీస్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ డెవాన్ కాన్వే కవర్ పాయింట్ మీదుగా ఆడిన షాట్‌ను ఆపబోయి గాయపడ్డాడు ఆసిఫ్. బుల్లెట్ వేగంతో బౌండరీ లైన్ దాటుతున్న బంతిని అడ్డుకోవడానికి అతను ప్రయత్నించి పట్టు తప్పాడు. కింద పడటంతో మడమకు దెబ్బ తగిలింది. బాధతో గ్రౌండ్ మీదే ఉండిపోయాడు.
అఫ్రిది జట్టులోకి..
ఫిజియో ఇచ్చిన ట్రీట్‌మెంట్ అనంతరం అతను గ్రౌండ్‌ను వీడాడు. బ్యాటింగ్‌కు దిగినప్పటికీ.. రెండే బంతులను ఎదుర్కొని అవుట్ అయ్యాడు. ఇదివరకు గాయంతో ఆసియాకప్ 2022 నుంచి వైదొలగిన పాకిస్తాన్ స్టార్ బౌలర్ షహీన్ షా అఫ్రిది తిరిగి జట్టుకు అందుబాటులోకి రానున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆసిఫ్ అలీ గాయపడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. గాయం తీవ్రత ఏమిటనేది పీసీబీ తెలియజేయాల్సి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications