కరాచీ: డ్రగ్ తీసుకున్నాడనే ఆరోపణలతో పాకిస్తాన్ క్రికెటర్ పైన రెండేళ్ల నిషేధం విధించారు. కరాచీలో జరగనున్న పెంటాగ్యూలర్ క్రికెట్ కప్ పోటీల సందర్భంగా ఆటగాళ్లకు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో పాకిస్తాన్ స్పిన్నర్ రజా హసన్ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు తేలింది.
అతని నుండి సేకరించిన రెండవ రక్త నమూనాలు పరీక్షించిన ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అతను డ్రగ్స్ సేవించినట్లు తేల్చింది. దీంతో రజా హసన్ పైన ఆ దేశ క్రికెట్ బోర్డు కనీసం రెండేళ్ల పాటు నిషేధం విధించనుందని తెలుస్తోంది.

రజా హసన్ మాదర ద్రవ్యాలు తీసుకున్నట్లుగా పరీక్షల్లో తేలిందని క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకునే అవకాశముందని పాకిస్తాన్ వర్గాలు చెబుతున్నాయి. హసన్ పాకిస్తాన్ తరఫున వన్డే ఇంటర్నేషనల్, ట్వంటీ 20 క్రికెట్‌లకు ప్రాతినిథ్యం వహించారు.