భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లు ప్లేయర్లకు డిఫెరెంట్ సవాళ్లు విసురుతాయని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. ఇరు జట్లు చివరిసారిగా టీ20 ప్రపంచకప్ - 2021లో తలపడ్డాయి. దుబాయ్‌లో బాబర్, మహమ్మద్ రిజ్వాన్ 150కి పైగా భాగస్వామ్యం నెలకొల్పడంతో పాకిస్థాన్ 10వికెట్ల తేడాతో గెలుపొందిందింది. రెండు జట్లు మళ్లీ దుబాయ్‌లోనే ఆసియాకప్ టోర్నీ ద్వారా మరోసారి తలపడనున్నాయి. ఈసారి ఆసియా కప్‌లో ఆగస్టు 28 ఆదివారం రోజు ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ విషయం గురించి బాబర్ తెలిపాడు.
'మేము ఎల్లప్పుడూ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ను సాధారణ మ్యాచ్‌లాగా ఆడటానికి ప్రయత్నిస్తాం.. కానీ కచ్చితంగా మాపై ఓ భిన్నమైన ప్రెషర్ ఉంటుంది' అని బాబర్ నెదర్లాండ్స్‌లో పాకిస్థాన్ పర్యటనకు ముందు చెప్పాడు. అంతకుముందు వెటరన్ బ్యాటర్ సోహైబ్ మక్సూద్ మాట్లాడుతూ.. అత్యుత్సాహం కారణంగానే పాకిస్థాన్ పెద్ద పెద్ద మ్యాచ్‌లలో భారత్ చేతిలో ఓడిపోయిందంటూ పేర్కొన్నాడు.

'ప్రపంచకప్ మ్యాచ్‌లలో భారత్ చేతిలో గతంలో పాకిస్థాన్ పదే పదే ఓడిపోవడానికి కారణం పాక్ టీం అత్యుత్సాహమే. కానీ ఇటీవల జట్టులో మార్పు వచ్చింది. ఇండో-పాక్ మ్యాచ్‌లను పాక్ టీం సాధారణంగా చూడటం ప్రారంభించింది. తద్వారా ఇండియాపై జట్టు ప్రదర్శన కూడా మెరుగైంది.' అని మక్సూద్ చెప్పాడు. మక్సూద్ చివరిసారిగా 2021 ఆగస్టులో జట్టు తరఫున ఆడాడు. గాయం కారణంగా ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ప్రపంచ కప్ నుండి తప్పుకున్నాడు. ఇక పాకిస్థాన్ విషయానికి వస్తే.. ఆసియా కప్ కంటే ముందు బాబర్ సారథ్యంలో ఆ దేశ జట్టు నెదర్లాండ్స్‌తో ఆగస్టు 16నుండి ఆగస్టు 21వరకు రోటర్‌డామ్‌లోని హజెలార్‌వెగ్‌లో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. 2018లో ఆసియాకప్‌లో చివరిసారిగా భారత్‌తో పాకిస్థాన్ తలపడింది. అప్పుడు పాక్ భారత్ చేతిలో ఓడిపోయింది.