పాక్‌ను ఒంటరిని చేయాలి: 20 ఏళ్ల పాటు దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఎలా దూరమైందో!

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ నుంచి పాకిస్థాన్‌ను బహిష్కరించాలని బీసీసీఐ క్రికెట్ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ మరోసారి డిమాండ్ చేశారు. వర్ణ వివక్షకు పాల్పడిన దక్షిణాఫ్రికాను ఒకప్పుడు క్రీడా ప్రపంచం ఎలా దూరంగా పెట్టిందో.. ఇప్పుడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ను కూడా అలాగే ఒంటరిని చేయాలని ఆయన అన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది మే30న ప్రారంభం కానున్న వరల్డ్‌కప్‌లో పాక్‌తో భారత్ ఆడాలా వద్దా అన్న చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

పుల్వామా ఉగ్రదాడిలో 40కి పైగా
పుల్వామా ఉగ్రదాడిలో 40కి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో పాక్‌తో భారత్ ఆడొద్దని అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్న దేశంతో సంబంధాలు తెంచుకోవాలని ఐసీసీ సభ్య దేశాలను బీసీసీఐ కోరింది.

ఇప్పటికే ఐసీసీకి లేఖ రాసిన బీసీసీఐ
వరల్డ్ కప్‌లో ఆటగాళ్లు, అధికారులు, అభిమానుల సంక్షేమం, పటిష్ట భద్రత కోసం లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే. పాక్‌ను వరల్డ్‌కప్ నుంచి తప్పించాల్సిందిగా ఐసీసీని కోరే ప్రతిపాదనను కూడా వినోద్ రాయ్ ముందుకు తీసుకొచ్చినా.. తర్వాత విరమించుకున్నారు.

వినోద్ రాయ్ మట్లాడుతూ
తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో వినోద్ రాయ్ మట్లాడుతూ "ఒక్క మ్యాచ్ గురించి మనం ఆలోచించకూడదు. పాకిస్థాన్‌తో ఆడకపోవడం అంటే మనకు మనం దెబ్బ తీసుకున్నట్లే. అసలు క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్‌ను ఒంటరిని చేయాలి" అని వినోద్ రాయ్ అన్నారు. తాను ఇంతకు ముందు చెప్పినట్లే అన్ని దేశాలు పాక్‌తో సంబంధాలను తెంచుకోవాలని చెప్పారు.

20 ఏళ్ల పాటు దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఎలా దూరమైందో!
"నల్ల జాతీయులపై వివక్ష చూపించి 20 ఏళ్ల పాటు దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఎలా దూరమైందో ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పాక్ విషయంలోనూ అలాంటిదే జరగాలి. దక్షిణాఫ్రికాలాగే పాక్‌ను కూడా అన్ని క్రీడల నుంచి నిషేధించాలి. ఐసీసీ సమావేశంలో ఈ ప్రతిపాదనను అధికారికంగా ప్రస్తావిస్తాం" అని ఆయన చెప్పారు. క్రీడల పరంగా పాకిస్థాన్‌ను ఒంటరిని చేయాలన్నా రాజకీయంగానే అది సాధ్యం అవుతుంది" అని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications