
హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ తన క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు చెప్పే విషయంపై బుధవారం స్పష్టతనిచ్చాడు. 36ఏళ్ల మాలిక్ మరో రెండేళ్ల పాటు నిలకడగా రాణించి జట్టులో కొనసాగాలనుకుంటున్నట్లు తెలిపాడు. మూడేళ్ల కిందటూ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పేశాడు. ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్లో 2019 వరల్డ్ కప్ నా వన్డే కెరీర్‌లో చివరిదని పేర్కొన్నాడు.
కానీ, ట్వంటీ20 క్రికెట్లో 2020లో జరిగే వరల్డ్ టీ20లో ఆడాలన్నదే తన లక్ష్యమని కరీబియన్ ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నమెంట్ సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రెండు పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకున్నా. మున్ముందు ఎలా సాగుతుందో చూడాలి. నిలకడగా నా ప్రదర్శనను కొనసాగిస్తే.. ఈ రెండు ప్రపంచకప్‌లకు ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నా అని మాలిక్ వెల్లడించాడు.
2015లో టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన షోయబ్ కొన్నేళ్ల నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగుతున్నాడు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్, ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన మాలిక్ పాక్ తరఫున 35 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. 261 వన్డేలు, 95 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
వీటితోపాటుగా ఓ అయిదేళ్లుగా కరీబియన్ ప్రీమియర్‌లీగ్‌లోనూ ఆడుతూ తన సత్తా చాటుతున్నాడు. ఐదేళ్లుగా బార్బాడోస్ ట్రైడెంట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించినా 2018 సీజన్‌కు గాను గుయానా అమెజాన్ వారియర్స్‌కు సంతకం చేశాడు. ఈ గుయానా జట్టులో బిగ్ బాష్ లీగ్, ఐపీఎల్ లలో పాల్గొన్న ఆటగాళ్లు ఆడుతున్నారు.