దుబాయ్: పాకిస్ధాన్ ఆఫ్ స్నిన్నర్, ఆల్ రౌండర్ మొహమద్ హఫీజ్ బౌలింగ్‌ను నిషేధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఈనెల 6వ తేదీన చెన్నైలోని శ్రీ రామచంద్ర యూనివర్సిటీలో అతడి బౌలింగ్ యాక్షన్‌ను పరీక్షించిన ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి 12 నెలలు పాటు నిషేధించింది.
శ్రీలంకపై (జూన్ 17-21)న గాలెలో జరిగిన తొలి టెస్టులో మ్యాచ్ అఫీసియల్స్ మొహమద్ హఫీజ్ బౌలింగ్‌పై తమ సందేహాలను వెలిబుచ్చారు. మ్యాచ్ అనంతరం మొహమద్ హఫీజ్ ఐసీసీ రూల్స్ ప్రకారం తన బౌలింగ్ యాక్షన్‌పై చెన్నైలో పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో హఫీజ్ విఫలం కావడంతో అతడిపై ఏడాది పాటు ఐసీసీ నిషేదం విధించింది.

ఈ పరీక్షలో మొహమద్ హఫీజ్ బౌలింగ్ వేసే సమయంలో తన మోచేతిని 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంచుతున్నట్లు నిర్దారణ కావడంతో ఐసీసీ ఈ చర్యకు ఉపక్రమించింది. గతేడాది నవంబర్‌లో అబుదాబిలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ మొదటి టెస్ట్‌లో హాఫీజ్ బౌలింగ్‌పై విమర్శలు రావడంతో అతని బౌలింగ్‌పై నిషేదం ఐసీసీ విధించింది.
అయితే మళ్లీ ఏప్రిల్ 2015లో మరోసారి హఫీజ్ బోలింగ్‌పై మ్యాచ్ అఫీసియల్స్‌కు అనుమానాలు రేకెత్తడంతో పరీక్షకు హాజరవ్వాల్సిందిగా ఐసీసీ కోరింది. రెండేళ్ల వ్యవధిలో ఏ క్రీడాకారుడైన అనుమానాస్పద బౌలింగ్ వేస్తే, మొదట అతడిని సస్పెండ్ చేస్తారు.
మళ్లీ రెండోసారి కూడా ఇదే రిపీట్ అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి 12 నెలల పాటు బౌలింగ్ వేయకుండా నిషేధిస్తారు. ఇదే ఇప్పుడు హఫీజ్ విషయంలో జరిగింది.