Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘సిమ్ కార్డు’కు ఆమడ దూరమంటున్న పాక్ అమీర్

కోల్‌కతా : పాకిస్థాన్ పేసర్ మహమ్మద్ అమీర్ టీ20 ప్రపంచ కప్ టోర్నీ కోసం కోల్‌కతాలో దిగాక లోకల్ సిమ్ కార్డు తీసుకోవాలంటేనే భయపడుతున్నాడట. ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ 2010 నుంచి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్న ఈ క్రికెటర్ ఇటీవలే తిరిగి జట్టులో స్థానం పొందిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో నిషేధం అతడిని పీడకలగా వెంటాడుతోంది. కోల్‌కతాకు చేరుకోగానే అధికారులు జట్టు సభ్యులందరికీ లోకల్ సిమ్ కార్డులను అందజేయగా అమీర్ మాత్రం సిమ్ కార్డును తిరస్కరించాడు.

Pakistan's Mohammad Amir refuses to use a local phone SIM card in India

మ్యాచ్ ఫిక్సర్లు, బుకీల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు చెబుతున్నాడు. కాల్ మాట్లాడాల్సి వచ్చిన ప్రతిసారీ సహచర జట్టు సభ్యుల వద్ద ఫోన్ తీసుకుంటున్నాడట.

అంతేకాదు పాకిస్తాన్ గెలుపు కోసం ప్రార్థనలు చేస్తున్నాడట. ఖాళీ సమయాల్లో వెలుగుతున్న కొవ్వొత్తి ముందు కూర్చుని ధ్యానం చేస్తున్నాడని నిర్వహణ అధికారుల్లో ఒకరు తెలిపారు.

అయితే జట్టు సభ్యులు మాత్రం ప్రాక్టీస్ లేనప్పుడు అమీర్ పాడే 'అతీఫ్ అస్లామ్' పాటలకు ఫిదా అయిపోతున్నారు. కాగా, శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్.. భారత్‌తో తలపడనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+