
హైదరాబాద్: పాకిస్థాన్ ఆఫ్ స్పిన్నర్ మహ్మద్ హఫీజ్‌పై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది. అతడి బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని ఐసీసీ స్పష్టం చేసింది.
అక్టోబర్ నెలలో అబుదాబి వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో హఫీజ్ బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉందని ఫీల్డ్ అంఫైర్లు ఐసీసీకి నివేదిక అందించారు. దీంతో నవంబర్ 1న ఇంగ్లాండ్‌లోని లౌబోరో యూనివర్సిటీలో అతడి బౌలింగ్ యాక్షన్‌ను పరీక్షించారు.
ఈ పరీక్షల్లో అతడు బౌలింగ్ వేసే సమయంలో 15 డిగ్రీల కంటే ఎక్కువ కోణంలో మోచేతిని వంచుతున్నట్లు తేలింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇలా బౌలింగ్ చేయడం విరుద్ధం. మూడేళ్ల వ్యవధిలో హఫీజ్‌పై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేయడం ఇది మూడోసారి.
తొలిసారి 2014లో కివీస్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా తొలిసారి హఫీజ్‌ని ఐసీసీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఏడాది ఏప్రిల్‌లో అతడు బౌలింగ్ యాక్షన్‌ను సరిచేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది నెలలకే శ్రీలంకతో జరిగిన గాలే టెస్టులో మళ్లీ తెరపైకి వచ్చాడు. దీంతో ఐసీసీ అతడు ఏడాదిపాటు సస్పెండ్ చేసింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.