Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో భార్య రెహామ్‌కు ‘తలాక్’ చెప్పిన ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రిక్ ఇన్‌సాఫ్ (పిటిఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ తన రెండో భార్య రెహామ్‌కు తలాఖ్ చెప్పారు. ఇద్దరు పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారు. పది నెలల క్రితమే ఇరువురు వివాహమాడిన విషయం తెలిసిందే. ఏమైందో ఏమో గానీ అంతలోనే విడిపోయారు.

ఈ జనవరిలోనే టీవీ జర్నలిస్టు అయిన రెహామ్‌ను ఇమ్రాన్ పెళ్లి చేసుకున్నారు. అయితే రెహామ్ రాజకీయల్లోకి వస్తాననడంతో మనస్థాపంతోనే ఇమ్రాన్ రెహామ్‌కు తలాఖ్ చెప్పినట్టు సమాచారం. ఈ మేరకు ఇమ్రాన్ రాజకీయ పార్టీకి చెందిన నేత ఒకరు ఫేస్‌బుక్, ట్విట్టర్ వేదికగా ధృవీకరించారు.

 Pakistan's Imran Khan and wife Reham Khan to divorce

అయితే ఇమ్రాన్ విడాకుల విషయంపై మీడియా దుమారం రేపొద్దని, తమ వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండాలని ఇరువురు కోరినట్టు పేర్కొన్నారు. కాగా, తమ విడాకుల విషయాన్ని వివాదాస్పదం చేయొద్దని రెహామ్ ఖాన్ ట్విట్టర్ ద్వారా కోరింది.

2004లో ఆయన తన మొదటి భార్య జెమినా గోల్డ్ స్మిత్‌కు విడాకులు ఇచ్చారు ఇమ్రాన్. జెమినాతో ఇమ్రాన్‌కు ఇద్దరు సంతానం కలిగారు. కాగా, గత కొంత కాలంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు వ్యతిరేకంగా తమ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేపట్టారు ఇమ్రాన్ ఖాన్.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+