న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌దే వరల్డ్‌కప్: యాదృశ్చికమేనా?, 1992 వరల్డ్‌కప్‌తో పోలుస్తూ ఫ్యాన్స్ ట్వీట్లు

Pakistans Identical Start To 1992 World Cup Triumph Leaves Fans Amused

హైదరాబాద్: యాదృశ్చికమో.. కాకతాళీయమో ఏమో తెలియదు గానీ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ పాకిస్థాన్‌దేనని పాక్ అభిమానులు సంబరపడుతున్నారు. అందుకు కారణం 1992 వరల్డ్‌కప్ టోర్నీ పరిస్థితులే ఇప్పుడు పాకిస్తాన్‌కు ఎదురవుతున్నాయి. అప్పుడు కూడా ఈ టోర్నీని రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలోనే నిర్వహించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆ టోర్నీలో పాక్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఘోర ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో పాక్ తన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌పై 14 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

శ్రీలంకతో శుక్రవారం జరగాల్సిన మ్యాచ్‌ రద్దు

ఈ మెగా టోర్నీలో మూడో మ్యాచ్‌ శ్రీలంకతో శుక్రవారం జరగాల్సిన మ్యాచ్‌ వర్షంతో రద్దవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. అప్పుడు కూడా ఇంగ్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ రద్దైంది. ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ పాక్ అభిమానులు సర్ఫరాజ్‌ నాయకత్వంలోని పాక్ ఈ వరల్డ్‌కప్‌ను గెలుస్తుందని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాక్‌ విజేతగా

1992 వరల్డ్‌కప్‌ని ప్రస్తుత పాక్ ప్రధాని, మాజీ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాక్‌ విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో అప్పటి వరల్డ్‌కప్‌తో ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్ గెలుపు, ఓటములను ప్రస్తావిస్తూ గణంకాలను సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన 1992 వరల్డ్‌కప్‌లో పాక్‌ ఓటమితోనే ప్రారంభించి వరుస విజయాలతో టైటిల్‌ను సొంతం చేసుకుంది.

సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ

సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ

శ్రీలంకతో మ్యాచ్ రద్దవడంపై పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ "మాకు మ్యాచ్‌ ఆడాలని చాలా ఉంది. కానీ, దురదృష్టవశాత్తు మ్యాచ్‌ రద్దవ్వడంతో ఏమి చేయలేకపోయాం. ఇంగ్లండ్‌పై విజయం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తాం" అని తెలిపాడు.

జూన్ 16న మాంచెస్టర్ వేదికగా భారత్‌తో మ్యాచ్

ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ పాకిస్థాన్‌కు నాలుగో మ్యాచ్‌ కాగా... భారత్‌తో జూన్ 16న మాంచెస్టర్ వేదికగా జరిగే మ్యాచ్ ఐదో మ్యాచ్‌. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్ ఓడితే 1992 వరల్డ్‌కప్ పరిస్థితులు పునరావృతం అవుతాయిని, తదుపరి మ్యాచ్‌లు వరుసగా గెలిచి ప్రపంచకప్‌ సాధిస్తుందనే ఆ దేశ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

Story first published: Saturday, June 8, 2019, 13:51 [IST]
Other articles published on Jun 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X