Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్ వీడియో.. పాకిస్థాన్ జట్టులో కోహ్లీ, ధావన్!!

Pakistan’s Defence Day: Virat Kohli, Shikar Dhawan plays for Pakistan in bizarre viral video

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్ పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోసం ఆడుతున్నట్లు ప్రస్తుతం ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఇరు దేశాల మధ్య యుద్ధం తరువాత భారతదేశంపై పాకిస్తాన్ సాధించిన విజయం గురించి.. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ పాకిస్తాన్ క్రికెట్ జట్టులో భాగం కావడం గురించి ఈ వీడియోలో చూపించారు. విషయంలోకి వెళితే.

శ్రీనగర్‌లో ఫైనల్ మ్యాచ్:

సెప్టెంబర్ 6వ తేదీన పాకిస్థాన్ 'డిఫెన్స్ డే'ని జరుపుకుంది. ఈ సందర్భంగా పాకిస్థానీ ప్రజలు సోషల్‌ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసారు. ఈ వీడియోను పాకిస్తాన్ జర్నలిస్ట్ నైలా ఇనాయత్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఈ వీడియోలో గ్రేటర్ పాకిస్థాన్‌ భారతదేశంను ఆక్రమించినట్లుగా చూపించారు. అంతేకాదు 2025లో టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌ శ్రీనగర్‌లో జరిగినట్లుగా ఉంది. కోహ్లీ, ధావన్ పాక్ జెర్సీలో కనిపించారు. అంతేకాక.. వాళ్లు పాకిస్థాన్ తరఫున మైదానంలో ఆడుతున్నట్లుగా కనిపిస్తున్నారు.

మ్యాచ్ కోహ్లీ గెలిపిస్తాడు:

మ్యాచ్ కోహ్లీ గెలిపిస్తాడు:

'2025లో టీ20 ప్రపంచకప్‌ ఫైనల్. ఈ మ్యాచ్‌లో ఇద్దరు గొప్ప బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. బాబర్ ఆజామ్ మరియు కోహ్లీ' అనే డైలాగ్‌తో ఈ వీడియో ప్రారంభమవుతుంది. ఆ వీడియోలో ఉన్న పాప మాట్లాడుతూ.. 'గుర్తు పెట్టుకొండి ఈ రోజు మ్యాచ్ కోహ్లీ గెలిపిస్తాడు' అని అంటుంది. దీనికి ఆమె తండ్రి 'కోహ్లీ ఇంతకుముందు భారత జట్టుకి ఆడేవాడు' అని సమాధానం ఇస్తాడు. దీనికి పిల్లలు ఆశ్చర్యకరంగా 'ఎవరు' అని అంటారు. వెంటనే ఆ వ్యక్తి చిరునవ్వుతో సమాధానమిస్తాడు. దీంతో వీడియో ఎండ్ అవుతుంది.

కోహ్లీపై నమ్మకం:

కోహ్లీపై నమ్మకం:

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి వీడియో ఎలా సృష్టిస్తున్నారు అని ఓ అభిమాని మండిపడ్డాడు. '2025లో పిల్లలకు కూడా బాబర్ కంటే కోహ్లీపై నమ్మకం ఉంచారు' అని ఒక వ్యక్తి కామెంట్ చేయగా.. 'ధావన్ నెం.3 స్థానంలో ఎవరు ఆడిస్తారో చెప్పండి' అని మరొకరు కామెంట్ చేశారు.

Story first published: Sunday, September 8, 2019, 13:16 [IST]
Other articles published on Sep 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+