Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ అంటే ఇష్టమన్న పాకిస్తాన్ జట్టు అమ్మాయి

కరాచీ: భారత జట్టు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వీరిలో యువతులే ఎక్కువ. గతంలో రాఖీ సావంత్... కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మను ఇదే విషయమై ఆట పట్టించినంత పని చేసింది కూడా.

క్రికెట్‌తో సంబంధం లేకుండా అమ్మాయిలంతా అతనంటే కోహ్లీ అంటే ఇష్టపడతారు. గత టీ20 ప్రపంచ కప్ సెమీస్‌లో విరాట్ ఇన్నింగ్స్ (72)కు ఫ్లాట్ అయిన డేనియల్ వ్యాట్ అనే ఇంగ్లండ్ మహిళా క్రికెటరైతే కోహ్లీ నన్ను పెళ్లి చేసుకో అంటూ అప్పట్లో ట్వీట్ చేసింది.

తాజాగా, ఓ పాకిస్తాన్ జట్టులో సభ్యురాలు కూడా కోహ్లీ అంటే అభిమానం అని చెబుతోంది. ఆమె పేరు బీస్మా మరూఫ్. తనకూ కోహ్లీ ఆట అంటే చాలా ఇష్టమని చెబుతోంది. ఈమె వయస్సు 24 ఏళ్లు. కోహ్లీ ఆట తనకు నచ్చుతుందని చెప్పింది.

Pakistan's Bismah Maroof draws inspiration from Virat Kohli

తాను లెఫ్ట్‌హ్యాండర్ బ్యాట్స్‌వుమన్‌నే అయినా అతని శైలి నుంచి ఎప్పటికప్పుడు స్ఫూర్తిపొందుతానని చెప్పింది. కోహ్లీతో పాటు సురేశ్‌ రైనాలను చూసి తాను బ్యాటింగ్‌ పాఠాలను నేర్చుకుంటున్నానని ఈ పాకిస్థాన్‌ బ్యాట్స్‌వుమెన్‌ బిస్మా మరూఫ్‌ అంది.

ఇటీవల బంగ్లాదేశ్‌పై పాక్‌ మహిళల జట్టు టీ20, వన్డే సిరీస్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఈ అమ్మాయి.. భారత బ్యాట్స్‌మెన్‌ తనకు స్ఫూర్తి అంది. విరాట్‌, రైనాల ఆటను చూసి చాలా నేర్చుకుంటున్నానని, షాట్‌ సెలెక్షన్‌, ఇన్నింగ్స్‌ నిర్మాణం తదితర విషయాల్లో వాళ్ల వీడియోలు తనకు పాఠాల్లో ఉపయోగపడుతున్నాయని, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ కూడా తనకు చాలా ఇష్టమని చెప్పింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+