న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆఖరి బంతికి సిక్స్: 55 బంతుల్లో సెంచరీ, టీ20 బ్లాస్ట్‌లో బాబర్ అజాం రికార్డు

Babar Azam Scores Century As Somerset Defeat Hampshire || Oneindia Telugu
Pakistans Babar Azam Smashes 55-ball Century in T20 Blast

హైదరాబాద్: ఇంగ్లాండ్ దేశవాళీ టీ20 టోర్నీ అయిన టీ20 బ్లాస్ట్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజాం అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఈ టీ20 లీగ్‌లో సోమర్సెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న బాబర్ అజాం శుక్రవారం హాంప్‌షైర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

<strong>రెండు మూడు పదవులుంటే తప్పేంటి?: ద్రవిడ్‌కు మద్దతుగా కుంబ్లే</strong>రెండు మూడు పదవులుంటే తప్పేంటి?: ద్రవిడ్‌కు మద్దతుగా కుంబ్లే

ఆఖరి బంతికి సిక్స్ బాది సెంచరీ

బాబర్ అజాం తన ఇన్నింగ్స్‌లో ఆఖరి బంతికి సిక్స్ బాది సెంచరీ సాధించడం విశేషం. 55 బంతుల్లో 6 సిక్సులు, 7 ఫోర్ల సాయంతో 102 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీ20ల్లో బాబర్ అజాంకు ఇది రెండో సెంచరీ.

తొలుత హాఫ్ సెంచరీ వరకు నెమ్మదిగా ఆడిన బాబార్ ఆజాం మిగతా హాఫ్ సంచరీని 23 బంతుల్లోనే సాధించాడు.

విలియమ్సన్ బర్త్ డే‌ని వినూత్నంగా జరిపిన లంక అభిమానులు (వీడియో)

https://telugu.mykhel.com/cricket/kane-williamson-celebrates-birthday-by-cutting-cake-with-fans-on-the-boundary-022736.html

మంచి ఫామ్‌లో ఉన్న బాబర్ అజాం

ఈ టోర్నీలో బాబర్ ఆజాం మంచి ఫామ్‌లో ఉన్నారు. బాబర్ అజాం సెంచరీతో సోమర్సెట్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంప్‌షైర్ జట్టు 12.1 ఓవర్లకు గాను 69/6 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది.

425 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా

దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం సోమర్సెట్‌ను విజేతగా ప్రకటించారు. ప్రస్తుతం టీ20ల్లో బాబర్ అజాం యావరేజి 42.6 ఉండగా.. స్ట్రయిక్ రేట్ 123.73గా నమోదైంది. ఈ లీగ్‌లో ఇప్పటిదాకా 8 మ్యాచ్‌లు ఆడిన బాబర్ ఆజాం 425 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

Story first published: Saturday, August 10, 2019, 13:44 [IST]
Other articles published on Aug 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X