Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్డిక్ పాండ్యాను నాకు వ‌దిలేయండి: రెండు వారాలు గ‌డువు ఇవ్వండి: పాక్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్‌

ICC Cricket World Cup 2019 : Former Pak All-Rounder Abdul Razzaq Offers To Coach Hardik Pandya
Pakistan’s Abdul Razzaq offers to coach Hardik Pandya

క‌రాచీ: ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో వ‌రుస విజ‌యాల‌ను సాధిస్తోంది భార‌త క్రికెట్ జ‌ట్టు. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో మెరుపులు మెరిపిస్తోంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును బెంబేలెత్తిస్తోంది. ఓపెన‌ర్లు మొద‌లుకుని లోయ‌ర్ మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ల వ‌ర‌కూ టీమిండియా బ్యాటింగ్ లైన‌ప్ ఎంత బ‌లంగా క‌నిపిస్తోందో.. బౌలింగ్ విభాగం కూడా అదే స్థాయిలో అద్భుతంగా రాణిస్తోంది. ఫాస్ట్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ జ‌ట్టుకు దూర‌మైన‌ప్ప‌టికీ.. మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ ఆ లోటును తీరుస్తున్నాడు. యార్క‌ర్ కింగ్ జ‌స్‌ప్రీత్ బుమ్రా, ఓ ఎండ్‌లో కుల్‌దీప్ యాద‌వ్‌, మ‌రో ఎండ్‌లో యజువేంద్ర చాహ‌ల్‌, పార్ట్ టైమ‌ర్‌గా కేదార్ జాద‌వ్ త‌మ ప‌ని తాము చేసుకుంటూ వెళ్తున్నారు.

భ‌య‌పెట్ట‌లేని పాండ్యా..

భ‌య‌పెట్ట‌లేని పాండ్యా..

ఎటొచ్చీ- ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా విష‌యంలో చిక్కొచ్చి ప‌డింది. బ్యాటింగ్‌లో పాండ్యా రాణిస్తున్న‌ప్ప‌టికీ.. బౌల‌ర్‌గా తేలిపోతున్నాడు. ఈ ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ప్ర‌త్య‌ర్థిని భ‌య‌పెట్టిన సంద‌ర్భాలు చాలా త‌క్కువే. త‌ర‌చూ లైన్ అండ్ లెంగ్త్‌ను కోల్పోతున్నాడు. తోటి బౌల‌ర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తున్న స‌మ‌యంలో.. పాండ్యా కాస్త ధారాళంగానే ప‌రుగులను ఇచ్చేస్తున్నాడు. బూమ్రా, ష‌మీ, కుల్‌దీప్ యాద‌వ్‌, చాహ‌ల్‌ల బౌలింగ్‌లో ప‌రుగులు తీయ‌డానికి ఇబ్బంది ప‌డుతున్న బ్యాట్స్‌మెన్లు పాండ్యా చేతికి బంతి అందుకునే స‌రికి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. స్వేచ్ఛ‌గా ఆడ‌గ‌లుగుతున్నారు.

టెక్నిక‌ల్ లోపాలు ఉన్నాయా?

టెక్నిక‌ల్ లోపాలు ఉన్నాయా?

ఈ వ్య‌వ‌హారం టీమిండియా మేనేజ్‌మెంట్‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. ఆదివారం బ‌ల‌మైన ఇంగ్లండ్ జ‌ట్టును ఢీ కొట్ట‌బోతున్న త‌రుణంలో హార్దిక్ పాండ్యాను ఆడించే విష‌యంలో టీమ్ మేనేజ్‌మెంట్ త‌న నిర్ణ‌యాన్ని పునఃస‌మీక్షించుకున్నా ఆశ్చ‌ర్యం లేదని చెబుతున్నారు. బ్యాటింగ్ వ‌ర‌కు ఫ‌ర్వాలేద‌నిపించుకుంటున్న పాండ్యా బౌలింగ్‌లో ప్ర‌భావం చూప‌లేక‌పోవ‌డాన్ని క్రికెట్ పండితులు సైతం ఎత్తి చూపుతున్నారు. పాండ్యా బౌలింగ్‌లో కొన్ని సాంకేత‌క లోపాలు క‌నిపిస్తున్నాయ‌ని, వాటిని స‌రిచేసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌ని వారు వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని స‌రిచేసుకోక‌పోతే- బౌల‌ర్‌గా చిక్కుల‌ను ఎదుర్కోవాల్సి రావ‌డం ఖాయ‌మ‌నీ జోస్యం చెబుతున్నారు.

నాకు వ‌దిలేయండి..

నాకు వ‌దిలేయండి..

ఈ నేప‌థ్యంలో- హార్దిక్ పాండ్యాకు బౌలింగ్ చిట్కాలు, మెళ‌కువ‌ల‌ను నేర్పించ‌డానికి ముందుకొచ్చారు ఓ లెజెండ‌రీ బౌల‌ర్‌. ఆయ‌నే.. అబ్దుల్ ర‌జాక్‌. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్‌. వ‌సీం అక్ర‌మ్‌, వ‌కార్ యూనిస్ వంటి హేమాహేమీల‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్న ఆట‌గాడు. టెస్ట్‌, వ‌న్డే, టీ20ల్లో బౌల‌ర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా రాణించారు. ఈ మూడు ఫార్మ‌ట్ల‌లో క‌లిపి మొత్తం 389 వికెట్ల‌ను తీసుకున్నాడు. హ్యాట్రిక్ కూడా ఆయ‌న పేరు మీద నమోదైంది. హార్దిక్ పాండ్యాకు శిక్ష‌ణ ఇవ్వ‌డానికి ఆయ‌న స్వ‌చ్ఛందంగా ముందుకొచ్చారు.

బ్యాలెన్ త‌ప్పుతున్నాడు..

బ్యాలెన్ త‌ప్పుతున్నాడు..

బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ కొన్ని లోపాలు క‌నిపిస్తున్నాయ‌ని రజాక్ చెప్పారు. బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో అత‌ని ఫుట్ వ‌ర్క్ ఒక చోట‌, శ‌రీరం మ‌రో చోట ఉంటోంద‌ని, ఫ‌లితంగా స‌మ‌తౌల్యం దెబ్బతింటోంద‌ని అన్నారు. బంతిని గ‌ట్టిగా బాదే స‌మ‌యంలో ఫుట్‌వ‌ర్క్ ప‌ర్‌పెక్ట్‌గా ఉండ‌క‌పోవ‌డం వ‌ల్ల బంతి గాల్లోకి ఎగురుతోందే త‌ప్ప స్టాండ్స్ దాట‌ట్లేద‌ని చెప్పారు. అవే లోపాలు బౌలింగ్‌లోనూ ఉన్నాయ‌ని, కొద్దిగా వాటిని స‌వ‌రించుకోగ‌లిగితే అత్యుత్త‌మ ఆల్‌రౌండ‌ర్‌గా రూపుదిద్దుకుంటాడ‌ర‌ని ర‌జాక్ అన్నారు. రెండు వారాల పాటు హార్దిక్ పాండ్యాను త‌న‌కు వ‌దిలిస్తే.. అత్యుత్త‌మంగా అత‌న్ని తీర్చిదిద్దుతాన‌ని చెప్పారు.

Story first published: Friday, June 28, 2019, 9:23 [IST]
Other articles published on Jun 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+