Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC ఓటమి: వారిద్దరిపై వేటు వేస్తున్నాం- పాక్ క్రికెట్ బోర్డు

టీ20 వరల్డ్ కప్‌లో తమ జట్టు ఘోరపరాజయం చవిచూడటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్దు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. మెగాటోర్నీ ముగిసిన ప్రతిసారీ ఇలాంటి చర్యలు తీసుకోవడం పాకిస్థాన్‌కు పరిపాటే. కెప్టెన్ లేదా కోచ్‌లపై వేటు వేస్తుంటుంది. అయితే ఈసారి మాత్రం భిన్నంగా సెలక్టర్లపై వేటు వేసింది.

టీ20 వరల్డ్ కప్ ఆతిథ్య దేశాలైన అమెరికా, వెస్టిండీస్ పిచ్‌లను అంచనా వేయకుండా జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లపై ఈసారి వేటు పడింది. సెలక్షన్ కమిటీ నుంచి వాహబ్ రియాజ్, అబ్దుల్ రజాక్‌ను తప్పిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. ''జాతీయ సెలక్షన్ కమిటీలో ఇకపై తమ సేవలు అవసరం లేదని వాహబ్ రియాజ్, అబ్దుల్ రజాక్‌లకు పీసీబీ తెలియజేసింది'' అని ఓ ప్రకటనలో పేర్కొంది.

Pakistan Removes Wahab Riaz and Abdul Razzaq from Selection Committee After Disappointing T20 World Cup Performance

అబ్దుల్ రజాక్ పాకిస్థాన్ మెన్స్ క్రికెట్ టీమ్‌తో పాటు ఉమెన్స్ టీమ్ సెలక్షన్‌ కమిటీలోనూ సభ్యుడు. మరోవైపు ఏడుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ‌లో వాహబ్ రియాజ్ ముఖ్యుడు. గతేడాది చీఫ్ సెలక్టర్‌గానూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరినీ తప్పించారు. పాకిస్థాన్ క్రికెట్‌లో భారీ మార్పులు జరుగుతాయని టీ20 వరల్డ్ కప్ ఘోరపరాజయం అనంతరం పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ వెల్లడించిన విషయం తెలిసిందే.

Pakistan Removes Wahab Riaz and Abdul Razzaq from Selection Committee After Disappointing T20 World Cup Performance

కాగా, సెలక్షన్ కమిటీలో ప్రస్తుతం అయిదుగురు సభ్యులు ఉన్నారు. మహ్మద్ యూసఫ్, అసద్ షఫికీ, బిలాల్ అఫ్జల్‌‌తో పాటు ప్రధాన్ కోచ్‌, కెప్టెన్ కమిటీలో ఉన్నారు. స్వదేశంలో ఆగస్టు 21 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు కూడా పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ఆస్ట్రేలియా, జింబాబ్వే, దక్షిణాఫ్రికా పర్యటనకు పాకిస్థాన్ వెళ్లనుంది. ఆసీస్‌, జింబాబ్వే, దక్షిణాఫ్రికాతో పాక్ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది.

Story first published: Wednesday, July 10, 2024, 12:49 [IST]
Other articles published on Jul 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+