Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెమీ ఫైనల్స్‌ కోసం పాకిస్తాన్‌కు బొట్టు పెట్టి మరీ ఆహ్వానం..!!

 Pakistan qualify scenario: Winner of Pakistan Vs Bangladesh will be in T20 World Cup semi finals

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ సూపర్ 12 ముగింపు రోజు మరో సంచలనం చోటు చేసుకుంది. సెమీ ఫైనల్స్ బెర్త్ దాదాపుగా కన్‌ఫర్మ్ చేసుకున్న దక్షిణాఫ్రికా జట్టు టోర్నమెంట్ నుంచి వైదొలగించింది. సెమీ ఫైనల్స్ చేరే అవకాశాలను చేజేతులారా పోగొట్టుకుంది. సూపర్ 12 దశలోనే ఆ జట్టు ప్రస్థానం ముగిసిపోయింది. తన చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో మట్టి కరిచింది దక్షిణాఫ్రికా. అత్యంత అవమానకరంగా టోర్నమెంట్ నుంచి అవుట్ అయింది.

 నెదర్లాండ్స్ అద్భుతం..

నెదర్లాండ్స్ అద్భుతం..

ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఆడిన తీరు - ఓ అద్భుతం. తనకంటే ఎంతో బలమైన దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపించింది. ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాపించింది. పరాజయాన్ని చవి చూపించింది. తొలుత బ్యాటింగ్‌లో ఆ తరువాత బౌలింగ్‌లో నెదర్లాండ్స్ ప్లేయర్లు చూపించిన తెగువ, దూకుడు ముందు దక్షిణాఫ్రికా వెలవెలబోయిన తీరు చూసి తీరాల్సిందే. దక్షిణాఫ్రికా ఈ టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో దాని స్థానంలో పాకిస్తాన్ సెమీ ఫైనల్స్‌కు చేరింది.

బ్యాటింగ్‌లో.. బౌలింగ్‌లో..

బ్యాటింగ్‌లో.. బౌలింగ్‌లో..

తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి 158 పరుగులు చేసింది. స్టెఫాన్ మైబర్గ్-37, మ్యాక్స్ ఓ డౌడ్- 29, టామ్ కూపర్- 35, కొలిన్ అక్కెర్‌మన్-41 పరుగులు చేశాడు. కొలిన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 26 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లు బాదాడు. టామ్ కూపర్ అతనికి సహకారం అందించాడు. 19 బంతుల్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 35 పరుగులు చేశాడు.

వరుస వికెట్లు..

వరుస వికెట్లు..

159 పరుగుల లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మొదట్లోనే చేతులెత్తేసింది. ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. దక్షిణాఫ్రికా బ్యాటర్లను కట్టి పడేయడంలో నెదర్లాండ్స్ బౌలర్లు నూటికి నూరుశాతం సక్సెస్ అయ్యారు. ఏ ఒక్క బ్యాటర్ కూడా భారీ స్కోర్ నమోదు చేయలేకపోయాడు. భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయాడు. ప్రారంభం నుంచీ వికెట్లు పడుతూ వచ్చాయి.

 145 పరుగుల వద్దే..

145 పరుగుల వద్దే..

ఓపెనర్లు క్వింటన్ డికాక్-13, టెంబా బావుమ-20, రిలీ రొస్సొ-25, ఎయిడెన్ మార్క్‌రమ్- 17, డేవిడ్ మిల్లర్-17, హెన్రిక్ క్లాసెన్- 21, వేన్ పార్నెల్-0, కేశవ్ మహరాజ్- 13.. ఇలా వికెట్లన్నీ ఒకదాని వెంట ఒకటి పడుతూ వచ్చాయి. ఏ దశలో కూడా కోలుకోలేకపోయింది దక్షిణాఫ్రికా. నెదర్లాండ్స్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్లను నష్టపోయి 145 పరుగులు మాత్రమే చేసింది దక్షిణాఫ్రికా.

గండం గట్టెక్కలేక..

గండం గట్టెక్కలేక..

దక్షిణాఫ్రికా ఓటమితో సెమీ ఫైనల్స్ ఈక్వేషన్లు అనూహ్యంగా మారిపోయాయి. దక్షిణాఫ్రికా కర్చీఫ్ వేసుక్కూర్చున్నప్పటికీ- నెదర్లాండ్స్ మట్టి కొట్టింది. ఆ జట్టు ఆశలను దారుణంగా దెబ్బ కొట్టింది. ఫలితంగా- దక్షిణాఫ్రికా తన గండాన్ని గట్టెక్కలేకపోయింది. ఈ ఒక్క మ్యాచ్‌లో గెలిచి ఉంటే ప్రొటీస్ టీమ్ సెమీఫైనల్స్ చేరుకుని ఉండేదే. న్యూజిలాండ్‌తో తలపడి ఉండేదే. చివరి హర్డిల్‌ను అధిగమించలేకపోయిందా జట్టు.

 పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్..

పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్..

ఈ పరిణామాలు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్‌కు వరంగా మారాయి. ఇవ్వాళ జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటుంది. గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కాస్త మెరుగైన నెట్ రన్‌రేట్‌ను కలిగివున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తన నెట్ రన్‌రేట్‌ను మరింత మెరుగుపర్చుకోగలుగుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ మూడు, బంగ్లాదేశ్ అయిదో స్థానంలో కొనసాగుతున్నాయి.

 నాలుగు పాయింట్లతో.

నాలుగు పాయింట్లతో.

పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల ఖాతాలో కూడా నాలుగు చొప్పున పాయింట్లు ఉన్నాయి. గెలిస్తే- రెండు జత కలుస్తాయి. ప్రస్తుతం అయిదు పాయింట్లతో రెండోస్థానంలో దక్షిణాఫ్రికాను కిందికి నెట్టి ఆరు పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకుతాయి. ఆ జట్టు ఏదనేది ఇంకాస్సేపట్లో తేలిపోతుంది. అడిలైడ్‌లో ఈ మ్యాచ్ ఆరంభమైంది కూడా. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

Story first published: Sunday, November 6, 2022, 9:52 [IST]
Other articles published on Nov 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+