Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క‌ల‌లో కూడా వెంటాడుతున్న టీమిండియా: పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోకు బ‌దులుగా..!

Pakistan Prime Minister Imran Khan’s special assistant Naeem ul Haq

ఇస్లామాబాద్‌: ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఇంగ్లండ్‌లోని మాంఛెస్ట‌ర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో భార‌త్‌తో జ‌రిగిన మ్యాచ్ వారం రోజుల త‌రువాత కూడా పాకిస్తాన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందా?, క‌ళ్లు మూసినా, తెరిచినా టీమిండియా క్రికెట‌ర్లే వారికి గుర్తుకు వస్తోందా? అనే ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానాన్ని ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దీనికి కార‌ణం- సాక్షాత్తూ పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ చిన్న‌ప్ప‌టి ఫొటోకు బ‌దుల‌గా టీమిండియా మాజీ కేప్టెన్, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ ఫొటోను పోస్ట్ చేయ‌డ‌మే.

ఆ పోస్ట్ చేసింది కూడా ఏ అల్లాట‌ప్పా వ్య‌క్తో కాదు. ఇమ్రాన్ ఖాన్‌ వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు న‌యీమ్ ఉల్ హ‌క్‌. ఈ ఫొటో కాస్తా నెటిజ‌న్ల బుర్ర‌కు ప‌దును పెట్టింది. దీనిపై త‌మ‌దైన శైలిలో సెటైర్లు వేస్తూ రెచ్చిపోతున్నారు నెటిజ‌న్లు. ఇమ్రాన్ ఖాన్ స్వ‌యానా ఓ గొప్ప క్రికెట‌ర్‌. ఆల్ రౌండ‌ర్‌. బ్యాటింగ్‌, బౌలింగ్‌ను అద్భుతంగా చేయ‌గ‌ల‌డు. ఇమ్రాన్ ఖాన్ కేప్టెన్సీలోనే పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు 1992 ప్ర‌పంచ‌క‌ప్‌ను స‌గ‌ర్వంగా ముద్దాడింది. అలాంటి క్రికెట‌ర్‌, పైగా ప్ర‌ధాని మంత్రి చిన్న‌ప్ప‌టి ఫొటో విష‌యంలో పొర‌పాటు ప‌డ్డాడు న‌యీమ్‌. ఇమ్రాన్ ఫొటోకు బ‌దులుగా స‌చిన్ టెండుల్క‌ర్ చిన్న‌ప్ప‌టి ఫొటోను త‌న అధికారిక ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. దానికి పీఎం ఇమ్రాన్ ఖాన్ 1969 అనే క్యాప్ష‌న్‌ను జ‌త చేశాడు. ఈ ఫొటోను ఆధారంగా చేసుకుని న‌యీమ్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజ‌న్లు.

Story first published: Sunday, June 23, 2019, 12:28 [IST]
Other articles published on Jun 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+