Pakistan playing XI: మహమ్మద్ నవాజ్ ఔట్.. హైదర్ అలీ డౌట్.. భారత్‌తో బరిలోకి దిగే పాక్ జట్టు ఇదే!

Pakistan playing 11 for India t20 world cup match: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. మరో 24 గంటల్లో ఈ హై ఓల్టెజ్ మ్యాచ్‌కు తెరలేవనుంది. ఇరు జట్లకు ఇదే ఫస్ట్ మ్యాచ్ కావడంతో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. మెగా టోర్నీల్లో భారత్ ఓడించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్న పాక్ ప్రతీసారి భంగపాటుకు గురైంది. కానీ ఈ సారి చాన్స్ వదులుకోవద్దని భావిస్తోంది. భారత్‌ను ఓడించి టోర్నీని ఘనంగా ప్రారంభించాలనుకుంటుంది. ఈ క్రమంలో అన్ని విధాలుగా సిద్దమైన ఆ జట్టు ఒక రోజు ముందే 12 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

12 మంది సభ్యుల టీమ్ ప్రకటన..

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఈ మేరకు శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే ఈ 12 మంది సభ్యులుగల ఈ జట్టులో ఆల్‌రౌండర్ మహమ్మద్ నవాజ్‌కు చోటు దక్కలేదు. ఊహించినట్లుగానే సీనియర్ ప్లేయర్లు అయిన షోయబ్ మాలిక్, మహమ్మద్ హఫీజ్‌లకు అవకాశం కల్పించింది. అనుభవానికే పీసీబీ ఓటేసింది. మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు సైతం నిరాశే ఎదురైంది. యువ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌కే పీసీబీ ఓటేసింది. షోయబ్ మక్సూద్, మహమ్మద్ వాసీమ్ కూడా బెంచ్‌కే పరిమితమయ్యారు.

 హైదర్ అలీ డౌట్..

హైదర్ అలీ డౌట్..

పీసీబీ ప్రకటించిన 12 మంది సభ్యులు గల ఈ జట్టులో హైదర్ అలీకి తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అయిన అతని పక్కనపెట్టవచ్చు. ఓపెనర్లుగా బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్ బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరు గత కొంత కాలంగా నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నారు. బాబర్ ఆజామ్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. మహమ్మద్ రిజ్వాన్ వామప్ మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. అయినప్పటికీ అతను రాణించగలడనే నమ్మకంతో పీసీబీ టీమ్‌మేనేజ్‌మెంట్ ఉంది. భారత్‌పై పాక్ పై చేయి సాధించాలంటే ఈ ఇద్దరు శుభారంభం అందించడం చాలా కీలకం. పైగా వరల్డ్ క్లాస్ బౌలర్లు అయినటు వంటి బుమ్రా, షమీ, శార్దూల్ బౌలింగ్‌ను వీరు ఎలా ఆడుతారనేది ఆసక్తికరం.

 మిడిల్‌లో సీనియర్లు..

మిడిల్‌లో సీనియర్లు..

ఇక ఫస్ట్ డౌన్‌లో ఫఖర్ జమాన్‌ బరిలోకి దిగనున్నాడు. ఆ తర్వాత నాలుగు, ఐదు స్థానాల్లో ఎంతో అనుభవం కలిగిన షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌ బరిలోకి దిగనున్నారు. మాలిక్‌కు భారత్‌పై మెరుగైన రికార్డు ఉంది. కీలక మ్యాచ్‌ల్లో వీరు రాణించడం చాలా ముఖ్యం. ఆరో స్థానంలో అసిఫ్ అలీ బ్యాటింగ్ చేయవచ్చు. ఆల్‌రౌండర్ల కోటాలో ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్ బరిలోకి దిగనున్నారు. స్పిన్నర్లు అయిన ఈ ఇద్దరు యూఏఈ పిచ్‌లపై కీలకం కానున్నారు. హసన్ అలీ, షాహిన్ షా అఫ్రీదీ, హ్యారిస్ రౌఫ్‌తో పేస్ విభాగం పటిష్టంగా ఉంది. ఈ ముగ్గురు మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరు చెలరేగితే భారత్‌కు కష్టాలు తప్పవు.

 పాకిస్థాన్ తుది జట్టు:

పాకిస్థాన్ తుది జట్టు:

బాబార్ ఆజామ్(కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్, మహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, అసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహిన్ షా అఫ్రిది, హ్యారిస్ రౌఫ్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, October 23, 2021, 15:53 [IST]
Other articles published on Oct 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X