For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK Playing 11 vs AUS:సెమీస్ ముందు భారీ షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ డౌటే!ఆసీస్‌తో బరిలోకి దిగే పాక్ జట్టిదే

Pakistan Playing 11 vs Australia: Mohammad Rizwan And Shoaib Malik Doubt In Semi Final.

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌ 2021 చివరి అంకానికి చేరుకుంది. బుధవారం తొలి సెమీస్ జరగగా.. ఇంగ్లండ్‌పై న్యూజీలాండ్ గెలిచి ఫైనల్ చేరింది. ఈరోజు (నవంబర్ 11) రెండో సెమీస్ మ్యాచ్ జరగనుంది. రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో టైటిల్‌ కోసం ఎవరు తలపడాలనేది ఈ మ్యాచ్‌తో తేలిపోనుంది. కంగారూల జట్టు జోరుమీదున్నా ఇప్పుడు పాకిస్థానే ఫేవరెట్‌ అని చెప్పోచ్చు. ఒకప్పుడు అనిశ్చితికి మారుపేరుగా ఉన్న పాక్ ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో కఠినమైన ప్రత్యర్థిగా మారిపోయింది. మరి రెండోసారి పొట్టి కప్పు కొట్టాలన్న కసితో ఆసీస్ సమరానికి పాక్ సిద్దమైంది. ఈ నేపథ్యంలో పాక్ ప్లేయింగ్ 11ను ఓసారి పరిశీలిద్దాం.

గతంలో కంటే భిన్నంగా:

గతంలో కంటే భిన్నంగా:

పాకిస్థాన్‌ ఎవరూ ఊహించని విధంగా టీ20 ప్రపంచకప్‌ 2021లో అదిరే ప్రదర్శన చేసింది. ప్రస్తుత టోర్నమెంట్లో ఓటమి చవిచూడని ఏకైక జట్టు పాకిస్థానే. పటిష్ట జట్లను ఓడించి సెమీస్ చేరింది. ఇక్కడ కూడా అదే ఫామ్ కొనసాగించాలని చూస్తోంది. యూఏఈలో పాకిస్థాన్‌ వరుసగా 16 మ్యాచ్‌లు గెలిచింది. గతంలో కంటే భిన్నంగా కనిపిస్తోన్న పాకిస్థాన్‌ ఒత్తిడికి తలవంచకుండా సాగుతోంది. యూఏఈలో చాలా సౌకర్యంగా కనపడుతోంది. అక్కడ అనేక పీఎస్‌ఎల్‌ మ్యాచ్‌లు ఆడడం, సొంతగడ్డపై ఆడాల్సిన అనేక సిరీస్‌లకు అక్కడ ఆతిథ్యమివ్వడమే అందుకు కారణం. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌పై విజయం సాధించాక పాకిస్థాన్‌.. దుర్భేద్యంగా మారిపోయింది. అన్ని విభాగాల్లో సత్తాచాటుతూ దూసుకుపోతోంది.

రిజ్వాన్, మాలిక్ డౌటే:

రిజ్వాన్, మాలిక్ డౌటే:

అయితే కీలక సెమీస్ మ్యాచుకు ముందు పాక్ జట్టుకు భారీ షాక్ తగిలేలా ఉంది. స్టార్ ఓపెనర్ మొహ్మద్ రిజ్వాన్, సీనియర్ ప్లేయర్ షోయబ్ మాలిక్ స్వ‌ల్పంగా ఫ్లూ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్నారు. దాంతో బుధ‌వారం ఇద్ద‌రూ ట్రైనింగ్ సెష‌న్‌కు హాజ‌రుకాలేదు. అయితే ఇద్ద‌రికీ కోవిడ్ ప‌రీక్ష‌లు చేయ‌గా.. వాళ్లు నెగ‌టివ్ తేలారు. టోర్న‌మెంట్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఐసీసీ నియ‌మావ‌ళి ప్ర‌కారం కూడా ఆట‌గాళ్ల‌కు కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. ఈరోజు వారిని వైద్య బృదం మరోసారి పరీక్షించనుంది. ఆస్ట్రేలియాపై వారు ఆడడం డౌటే అని తెలుస్తోంది. అయితే కీలక మ్యాచ్ కాబట్టి పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ వారిని పక్కనపెట్టే సాహసం చేయకపోవచ్చు. ముఖ్యంగా రిజ్వాన్‌ను. ఎందుకంటే.. అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు.

పటిష్టంగా పాక్:

పటిష్టంగా పాక్:

బాబర్‌ అజామ్‌ నేతృత్వంలోని ఆ జట్టు టాప్‌ ఆర్డర్‌ బలంగా ఉంది. బాబర్‌ 264 పరుగులతో టోర్నీ టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. ఓపెనర్లు బాబర్‌, మొహ్మద్ రిజ్వాన్‌ మంచి ఆరంభాలు ఇస్తున్నారు. ఒకవేళ రిజ్వాన్‌ ఆడకుంటే.. అతడి స్థానంలో హైదర్ అలీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఫకర్ జామన్, అసిఫ్‌ అలీ, షోయబ్‌ మాలిక్‌, మొహ్మద్ హఫీజ్‌ రూపంలో పాక్‌కు మిడిల్‌ ఆర్డర్లో మ్యాచ్‌ విన్నర్లున్నారు. గాయపడిన మాలిక్‌ స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇక పాకిస్థాన్‌ బౌలింగ్‌ కూడా టోర్నీ ఆరంభం నుంచి ఆకట్టుకుంటోంది. పేసర్లు షహీన్‌ షా అఫ్రిది, రవూఫ్‌ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు సృష్టిస్తున్నారు. ఇక స్పిన్నర్లు ఇమాద్‌ వసీమ్‌, మహ్మద్‌ హఫీజ్‌, షాద్‌బ్‌ ఖాన్‌లు ప్రధాన అస్త్రాలుగా మారారు. వీరిని ఎదుర్కోవడం ఆస్ట్రేలియాకు కష్టమనే చెప్పాలి.

పాకిస్తాన్ తుది జట్టు (అంచనా):

పాకిస్తాన్ తుది జట్టు (అంచనా):

బాబర్‌ ఆజామ్, మొహ్మద్ రిజ్వాన్‌/హైదర్ అలీ, ఫకర్ జామన్, షోయబ్‌ మాలిక్‌/సర్ఫరాజ్ అహ్మద్, మొహ్మద్ హఫీజ్‌, అసిఫ్‌ అలీ, ఇమాద్‌ వసీమ్‌, షాద్‌బ్‌ ఖాన్‌, షహీన్‌ షా అఫ్రిది, హారిస్ రవూఫ్‌.

Story first published: Thursday, November 11, 2021, 13:19 [IST]
Other articles published on Nov 11, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+