Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: భారత్‌ను ఈ వేదికపై గతంలో ఓడించాం, ఈ సారి కూడా.. పాక్ పేసర్ ప్రగల్భాలు

IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టోర్నమెంట్ లో రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కో మ్యాచ్ ఆడాయి. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 60 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడగా.. భారత జట్టు బంగ్లాదేశ్ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.

ఈ నేపథ్యంలో టీమిండియా పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ లో గెలిచి సెమీ ఫైనల్ కు చేరుకోవాలని చూస్తోంది. మరోవైపు పాకిస్థాన్ జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి రేసులో తనను తాను నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

Pakistan Pacer Harris Rauf s Bold Statement Before the Champions Trophy 2025 Match

పాక్ పేసర్ హారిస్ రవూఫ్ మాట్లాడుతూ.. "భారత్ తో జరిగే మ్యాచ్ కు సంబంధించి తమ జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదని అన్నాడు. ఇది తమ జట్టుకు మంచి మ్యాచ్ అవుతుందని ఆశిస్తున్నానన్నాడు. దుబాయ్ లో పాకిస్థాన్ కు మెరుగైన రికార్డు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. కానీ అది స్పిన్ ట్రాక్ కావచ్చు కాబట్టి అంతా పిచ్ పై చాలా ఆధారపడి ఉంటుందన్నాడు.

పరిస్థితిని పరిశీలించిన తర్వాత ప్రణాళికలను రూపొందించడానికి ప్రయత్నిస్తామని హారిస్ రవూఫ్ అన్నాడు. 2021లో దుబాయ్ లోని మైదానంలో ఆడిన టీ20 ప్రపంచ కప్ లో, ఆ తర్వాత 2022లో జరిగిన ఆసియా కప్ లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లలో భారత జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ క్రమంలోనే పాక్ పేసర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Story first published: Saturday, February 22, 2025, 14:24 [IST]
Other articles published on Feb 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+