Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నవ్వుల పాలయిన పాకిస్థాన్ స్టార్ క్రికెటర్.. అతన్ని కూల్ డ్రింక్స్ సప్లయర్‌లా ట్రీట్ చేసిన అభిమాని

Pakistan Pacer Haris Rauf Funny Video Getting viral On social media

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో నెదర్లాండ్స్‌ను పాకిస్థాన్ వైట్ వాష్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆసియా కప్ 2022 టోర్నీకి ఆ జట్టు సిద్ధమవుతుంది. బాబర్ ఆజం నేతృత్వంలోని టీ20 జట్టు ఇప్పటికే తమ సన్నాహకాలు ప్రారంభం చేసింది. ఇక నెదర్లాండ్స్ పర్యటనలో తొలి రెండు మ్యాచ్‌లలో పాకిస్థాన్ గెలిచినందున చివరి గేమ్‌లో కొంత మంది ప్లేయర్లకు విశ్రాంతి లభించింది.

వీరిలో స్టార్ పేసర్ హరీస్ రౌఫ్, ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ ఉన్నారు. ఇక మూడో వన్డే టైంలో ఓ ఆస్తికకర విషయం చోటుచేసుకుంది. స్టాండ్స్‌లో ఓ పాకిస్థాన్ అభిమాని చేసిన పని నవ్వులు తెప్పించింది. అయితే కొందరు పాకిస్థానీ అభిమానులు మాత్రం ఈ విషయమై సీరియస్ కామెంట్లు చేస్తున్నారు.

షాకైన రౌఫ్

ఇందుకు సంబంధించిన వీడియోను ఓ అభిమాని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. వీడియోలో.. రౌఫ్, షాదాబ్ ఖాన్ బౌండరీ లైన్ వద్ద నడుస్తుండగా.. కొంతమంది ప్రేక్షకులు వారిని చూసి కేకలు వేశారు. ఇక తమను కలవాలనుకుంటున్నారని భావించిన రౌఫ్, షాదాబ్ ఖాన్ ప్రేక్షకుల వద్దకు వెళ్లారు. అయితే అదే టైంలో రౌఫ్ చేతిలో కూల్ డ్రింక్ బాటిల్ క్యారియర్‌ ఉంది.

బౌండరీ లైన్ నుంచి రౌఫ్ ప్రేక్షకుల వైపు రాగా.. అంతలో ఓ పాక్ అభిమాని చాలా హడావుడిగా వచ్చాడు. అతను రౌఫ్‌ను కలవాలనే ఉత్సుకతతో ఉన్నాడని అంతా భావించారు. అయితే సడెన్‌గా అతను రౌఫ్ పట్టుకున్న క్యారియర్ నుండి రెండు జ్యూస్ బాటిల్స్ తీసుకుని వెంటనే వెనక్కి మళ్లాడు. రౌఫ్ షాకయ్యాడు. తననేదో కలవాలని వచ్చాడనుకున్నట్లు ఫేస్ పెట్టాడు.

ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగే బుద్ధి

వెంటనే కవరింగ్ చేస్తూ ఓ స్మైల్ ఇచ్చాడు. ఒరే నాయనా బాటిల్స్ తీసుకుంటే తీసుకుంటివి గానీ ఒకటే తీసుకో రెండేందుకురా అని చెప్పాడు. అయితే ఆ అభిమాని అదేం పట్టకుండా ఎంచక్కా తన సీట్లోకి వెళ్లిపోయాడు. ఇక ఆ అభిమాని పనికి అక్కడున్న వారందరు నవ్వుకున్నారు. ముఖ్యంగా పక్కనే ఉన్న షాదాబ్ ఖాన్ అయితే పగలబడి నవ్వాడు.

ఈ విషయాన్ని ఆ ఇద్దరు ప్లేయర్లు పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. ఇక కొందరు నెటిజన్లు ఈ వీడియోపై సరదాగా స్పందిస్తుంటే.. మరికొందరు మాత్రం.. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగే మన బుద్ధి ఇక పోనివ్వరు కదా అంటూ పలువురు పాక్ అభిమానులు సీరియస్ అయ్యారు. కాస్త డిసిప్లన్‌గా ప్రవర్తించాలి అంటూ దెప్పిపొడిచారు. ఏదేమైనా స్టార్ క్రికెటర్ నవ్వులపాలయ్యాడు.

ఆసియాకప్ పాకిస్థాన్ స్క్వాడ్ ఇదే..

ఇకపోతే ఆసియాకప్ టోర్నీకి ఎంపికైన జట్టులో హరీస్ రౌఫ్ ఉన్నాడు. షాహీన్ అఫ్రిది గాయంతో దూరం కావడంతో రౌఫ్ పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. ఇక ఆగస్టు 28న పాక్ వర్సెస్ భారత్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఓసారి పాకిస్థాన్ స్క్వాడ్‌ను గమనిస్తే.. బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, షానవాజ్ హహానీ, మహ్మద్ దహానీ, మహ్మద్, ఉస్మాన్ ఖాదిర్.

Story first published: Wednesday, August 24, 2022, 17:23 [IST]
Other articles published on Aug 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+