బ్యాట్స్‌మెన్‌కు తృటిలో తప్పిన పెనుప్రమాదం.. బౌన్సర్‌కు రెండు ముక్కలైన హెల్మెట్! (వీడియో)

హరారే: 2014, నవంబర్ 25న ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఓ రాకాసి బౌన్సర్‌కు ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. ఆసీస్ దేశవాళీ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో భాగంగా సిడ్నీ క్రికెట్ మైదానంలో సౌత్ ఆస్ట్రేలియా, న్యూసౌత్ వేల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రత్యర్థి పేసర్ విసిరిన బౌన్సర్ సౌత్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ అయిన ఫిలిప్ హ్యూస్‌కు బలంగా తగిలింది. హెల్మెట్ ధరించినప్పటికీ ఎడమచెవి కింది భాగంలో బంతి తాకింది.
దీంతో అతను వెంటనే నేలపై కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి చేరుకొని కోమాలోకి వెళ్లాడు. రెండు రోజుల తర్వాత సమీపంలోని ఆసుపత్రిలో కన్నుమూశాడు. అలాంటి రాకాసి బౌన్సర్‌రే తాజాగా జింబాబ్వే బ్యాట్స్‌మన్‌కు తాకింది. అతడికి ఎలాంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
హెల్మెట్ రెండు ముక్కలు
హరారే వేదికగా పాకిస్థాన్-జింబాబ్వే జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. పాకిస్థాన్ తరఫున అరంగేట్రం చేసిన పేస్ బౌలర్ అర్షద్ ఇక్బాల్ వేసిన రెండో ఓవర్‌లో భాగంగా ఓ బంతిని జింబాబ్వే బ్యాట్స్‌మన్ తినాషే కామున్హుకామ్వే షాట్ ఆడబోగా అది అతని హెల్మెట్‌కు తగిలింది. హెల్మెట్‌కు తగలడమే ఆసల్యం.. పైన ఉన్న లేయర్ ఒక్కసారిగా ఊడిపోయింది.
హెల్మెట్ రెండు ముక్కలైనట్లు తొలుత అనిపించినా.. అది పైన ఉన్న అవుటర్ లేయర్ కాబట్టి బ్యాట్స్‌మన్ తినాషేకు ఎలాంటి గాయం కాలేదు. మైదానంలోని ఆటగాళ్లు, అంపైర్ వచ్చి అతడిని పరీక్షించారు. ఎలాంటి గాయం కాలేదని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.

మహ్మద్ నబీకి కూడా
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్, అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్ మహ్మద్ నబీకి కూడా ఇటీవలే పెను ప్రమాదం తప్పింది. ఐపీఎల్ 202లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నబీ బ్యాటింగ్ చేస్తుండగా.. ఓ రాకాసి బౌన్సర్ అతడికి బలంగా తగిలింది. సరిగ్గా అది అతని మెడభాగంలో తగలడంతో మైదానంలోని ఆటగాళ్లతో పాటు అందరూ వణికిపోయారు. ఆ బౌన్సర్ దెబ్బకు ఒక్కసారిగా అందరికి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం గుర్తొచ్చింది. కానీ అదృష్టవశాత్తు నబీ గాయం పెద్దది కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పాకిస్థాన్‌కు జింబాబ్వే షాక్
దశాబ్దాలుగా క్రికెట్ ఆడుతున్నా ఇప్పటికీ పసికూనగానే ఉన్న జింబాబ్వే.. పాకిస్థాన్‌కు షాకిచ్చింది. శుక్రవారం జరిగిన రెండో టీ20లో 19 పరుగులతో గెలిచింది. జింబాబ్వే నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పాకిస్థాన్ 99 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజామ్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆజామ్, ఫకర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్ లాంటి బ్యాటింగ్ లైనప్ ఉన్న పాక్.. స్వల్ప లక్ష్యాన్ని కూడా చేజ్ చేయలేకపోయింది. ఈ మ్యాచ్ గెలిచిన జింబాబ్వే 1-1తో సిరీస్‌ను సమం చేసింది.
ఫన్నీ వీడియోలు:
ఈ ఓటమిని పాకిస్థాన్ అభిమానులు జీర్ణించుకోవడం లేదు. పాకిస్తాన్ టీమ్‌పై విరుచుకుపడుతున్నారు. కానీ మిగతా క్రికెట్ అభిమానులు మాత్రం ఈ ఓటమిపై ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రకరకాల ఫన్నీ వీడియోలను ఈ మ్యాచ్‌కు లింక్ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications