కరాచీ: తనకు అడిగిన మొత్తం డబ్బులివ్వాలని లేదంటే, నీ ప్రతిష్టకు భంగం కలిగించే వీడియోలను బహిర్గతం చేస్తానని అపరిచితుల నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని పాకిస్తాన్ ఓపెనర్ షర్జీల్ ఖాన్ వెల్లడించాడు.

ఇటీవల ఆసియా కప్, ట్వంటీ 20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టుకు షర్జీల్ ఖాన్ ప్రాతినిథ్యం వహించాడు. తాజా బెదిరింపుల నేపథ్యంలో అభిమానులు, సన్నిహితులను ఉద్దేశించి షర్జీల్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశాడు.
అందులో... డబ్బులివ్వాలని తనకు అపరిచితుల నుంచి కాల్స్ వచ్చాయని, అడిగిన మొత్తం ఇవ్వకుంటే తనకు సంబంధించిన వీడియోలు విడుదల చేస్తామని బెదిరిస్తున్నారని, వారు విడుదల చేసేవి నకిలీవని, నేను ఎలాంటి తప్పులు చేయలేదని తెలిపాడు.