
హైదరాబాద్: సచిన్ టెండూల్కర్... ప్రపంచంలోనే అత్యత్తుమ ఆటగాళ్లలో ఒకడు. అంతేకాదు ఈ పేరు తెలియని భారత క్రికెట్ అభిమాని ఉండడు. తన అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్‌లో ఎన్నో రికార్డులను నెలకొల్పిన సచిన్ టెండూల్కర్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
తాజాగా పాకిస్థాన్‌కు చెందిన క్రికెటర్ అహ్మద్ షాజాద్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ ఎప్పటికీ అత్యుత్తమ బ్యాట్స్‌మనే అంటూ ట్విట్టర్‌లో కొనియాడాడు. ట్విట్టర్ వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు షాజాద్ సమాధానమిచ్చాడు.
ఇందులో భాగంగా సచిన్ గురించి కొన్ని మాటలు చెప్పండి అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ "ఉత్తమ బ్యాట్స్‌మన్, ఆదర్శప్రాయుడు, అన్నింటికంటే అత్యుత్తమ మానవత్వం ఉన్న వ్యక్తి.. అందరినీ ఒకేలా గౌరవిస్తారు" అని తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. షాజాద్ ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.