సెమీస్ బెర్త్ కోసం పాకిస్తాన్‌కు కావాలి 312 పరుగుల తేడాతో విజయం

లండన్: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌లో అడుగు పెట్టడానికి పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఆ జట్టు ఆశలు ఇంకా సమాధి కాలేదు. సర్ఫరాజ్ అహ్మద్ జట్టు సెమీస్‌లో అడుగు పెట్టడానికి చిట్టచివరి అవకాశం ఇంకా ఉండనే ఉంది. తన చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడిపోవడం పాకిస్తాన్‌కు మరోసారి సువర్ణావకాశాన్ని కల్పించింది. రన్‌రేట్‌లో పాకిస్తాన్ కంటే- న్యూజిలాండ్ చాలా మెరుగ్గా ఉన్నప్పటికీ..దాన్ని అందుకోవడం కష్టసాధ్యమే. పాకిస్తాన్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీ కొట్టాల్సి ఉంది.

312 పరుగుల తేడాతో గెలుపొందడం అవసరం..
పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు తమ చిట్టచివరి లీగ్ మ్యాచ్ ఆడబోతున్నాయి. శుక్రవారం లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగబోతోంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కాబోయే ఈ మ్యాచ్.. పాకిస్తాన్‌కు చావోరేవోగానే పరిగణించుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. భారీ నుంచి అతి భారీ స్కోరును చేయాల్సి ఉంటుంది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన బంగ్లాదేశ్‌ను అతి తక్కువ పరుగులకు కట్టడి చేయాలి. తక్కువలో తక్కువగా 312 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించాల్సి ఉంటుంది పాకిస్తాన్. అది సాధ్యపడితే- పాకిస్తాన్ సెమీస్ చేరుతుంది. ఒక వన్డే మ్యాచ్‌లో 312 పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించడం అనేది దాదాపు అసాధ్యంగానే భావించుకోవచ్చు.

బ్లాక్ క్యాప్స్..బ్యాక్ అండ్ బ్యాక్!
సెమీఫైనల్‌కు ప్రవేశించే అవకాశాలు న్యూజిలాండ్‌కు పాకిస్తాన్ కంటే మెరుగ్గా ఉన్నాయి. పాకిస్తాన్ 312 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించడం అసాధ్యమైనందున.. బ్లాక్ క్యాప్స్ నిశ్చింతంగా ఉండొచ్చు. ఆ జట్టు ఆటతీరు మాత్రం కలవర పెడుతోంది. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ అత్యంత నాసిరకమైన ఆటతీరును ప్రదర్శించింది. అటు బ్యాట్‌తో, ఇటు బంతితో ఏ మాత్రం రాణించలేక చేతులెత్తేసింది. 119 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది విలియమ్సన్ టీమ్. న్యూజిలాండ్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. మొదట పాకిస్తాన్‌తో, ఆ తరువాత దక్షిణాఫ్రికాతో ఓడిపోయింది. తాజాగా- ఇంగ్లండ్‌తో పరాజయం కావడంతో ఆ జట్టులో ఆత్మవిశ్వాసం లోపించింది. సెమీస్ అడుగు పెడితే- న్యూజిలాండ్..అత్యంత బలమైన ఆస్ట్రేలియాను ఢీ కొట్టాల్సి ఉంటుంది.

ఇంగ్లండ్ ఇక బేఫికర్..
సెమీఫైనల్ చేరాలంటే గెలిచి తీరాల్సిన రెండు మ్యాచ్‌ల్లో విజయఢంకా మోగించింది ఇంగ్లీష్ టీమ్. ఆ జట్టు ఎదుర్కొన్నది సమవుజ్జీల్లాంటి జట్లను. అయినప్పటికీ.. అదర లేదు, బెదరలేదు. తొలుత టీమిండియాను, ఆ తరువాత న్యూజిలాండ్‌ను మట్టి కరిపించింది. ఇక బేఫికర్‌గా సెమీస్‌లోకి అడుగు పెట్టింది. సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ జట్టు మరోసారి భారత్‌ను ఢీ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది ఇంగ్లండ్. మూడో స్థానంలో ఉన్న జట్టు ద్వితీయ స్థానంలో ఉన్న టీమ్‌ను ఢీ కొట్టాల్సి ఉంటుంది. టీమిండియాకు శ్రీలంకతో మ్యాచ్ మిగిలే ఉన్నందు.. ఆ మ్యాచ్ జయాపజయాలపై స్థానాల మార్పిడి ఉండొచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications