Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లా క్రికెట‌ర్ల‌పై పిడుగుప‌డితే త‌ప్ప పాక్ సెమీస్ చేర‌లేదు: మ‌హ‌మ్మ‌ద్ యూసుఫ్

Pakistan need lightning to strike Bangladesh to keep semi-finals hope alive: Mohammad Yousuf

లాహోర్‌: ప్రపంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌ సెమీ ఫైన‌ల్‌కు చేరాల‌నుకునే పాకిస్తాన్ ఆశ‌లు ఇక అడుగంటాయి. పాకిస్తాన్ జ‌ట్టు ఇక ఎంత‌మాత్రమూ సెమీఫైన‌ల్‌కు చేరే అవ‌కాశాలు లేనే లేవు. చెస్ట‌ర్‌-లీ-స్ట్రీట్‌లోని రివ‌ర్‌సైడ్ దుర్హం స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఘ‌న విజ‌యం సాధించ‌డంతో పాకిస్తాన్ ప‌ని ఖ‌త‌మైపోయింది. ఇక నామ‌మాత్రమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ బంగ్లాదేశ్‌ను ఢీ కొట్ట‌బోతోంది. శుక్ర‌వారం ఈ మ్యాచ్ లండ‌న్‌లోని లార్డ్స్ స్టేడియంలో భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆరంభం కాబోతోంది. సెమీస్ చేరాలంటే పాకిస్తాన్ ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 312 ప‌రుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యం. ఈ నేప‌థ్యంలో- ఏదైనా అనుకోని సంఘ‌ట‌న‌లు, అద్భుతాలు జ‌రిగితే త‌ప్ప పాకిస్తాన్ టీమ్ సెమీఫైన‌ల్‌కు వెళ్లే అవ‌కాశాలు లేవ‌ని మాజీ క్రికెట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ యూసుఫ్ అన్నారు.

బంగ్లా క్రికెట‌ర్ల‌పై పిడుగు ప‌డితే త‌ప్ప‌..

పాకిస్తాన్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని అందుకోవ‌డానికి బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు స్టేడియంలోకి అడుగు పెట్టిన వెంట‌నే పిడుగు ప‌డి, వారంద‌రూ మూర్ఛ‌పోతే- అప్పుడు పాకిస్తాన్ సెమీఫైన‌ల్‌కు అవ‌లీల‌గా వెళ్ల‌గ‌లుగుతుంద‌ని యూసుఫ్ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ క్రికెట‌ర్ల‌పై పిడుగు ప‌డ‌ట‌మో, లేక ఒక ఓవ‌ర్‌కు ప‌ది ప‌రుగులు చేయాల్సి రావడ‌మో వంటి అద్భుతాలు జ‌రిగితే త‌ప్న స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్ టీమ్ సెమీ ఫైన‌ల్‌లో అడుగు పెట్ట‌బోద‌ని అన్నారు. ఇలాంటి అద్భుతాలు, క‌ల్పితాలు అన్నీ, క‌థ‌ల్లో రాసుకోవ‌డానికి బాగుంటాయే త‌ప్ప‌, నిజ జీవితంలో సాధ్యం కావ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అలాంటి అద్బుత‌మేదైనా జ‌ర‌గాల‌ని అల్లాను ప్రార్థించ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని అన్నారు. అత్యంత బ‌ల‌హీన‌మైన జ‌ట్టుతో ఆడిన‌ప్ప‌టికీ.. 316 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించ‌డం సాధ్య‌మ‌య్యే ప‌ని కాద‌ని చెప్పారు.

Story first published: Thursday, July 4, 2019, 17:27 [IST]
Other articles published on Jul 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+