T20 World Cup 2021: మూడు మార్పులు చేసిన పాకిస్థాన్.. సర్ఫరాజ్ వచ్చేశాడు! పాక్ తుది జట్టు ఇదే!!

కరాచీ: మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్ 2021కు సమయం దగ్గరపడుతోంది. ఒమన్, యూఏఈలో జరగనున్న పొట్టి ప్రపంచకప్ కోసం యునైటెడ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. అయితే అక్టోబర్ 10 వరకు ప్రకటించిన తుది జట్లలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పేర్కొంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ జట్టులో మూడు మార్పులను చేసింది. సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చాడు.

మూడు మార్పులు:
ఇదివరకు ప్రకటించిన పాకిస్తాన్ జట్టులో పీసీబీ శుక్రవారం మూడు మార్పులను చేసింది. గతంలో ప్రకటించిన మహ్మద్ హస్నేన్, అజమ్ ఖాన్ స్థానాల్లో సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీలను తుది 15 మంది జట్టులోకి తీసుకుంది. రిజర్వ్ ఆటగాళ్లలో ఫఖర్ జమాన్ బదులుగా ఖుష్దిల్ షాను తీసుకున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. ముందుగా ప్రకటించిన జట్టులో ఫఖర్ జమాన్ రిజర్వ్ ప్లేయర్ కాగా.. ఇప్పుడు తుది 15 మంది జట్టులోకి వచ్చాడు. ఇక సక్లెయిన్ ముస్తాక్‌ను తాత్కాలిక కోచ్‌గా నియమిస్తున్నట్లు పీసీబీ పేర్కొంది. మిస్సా ఉల్ హక్, వకార్ యూనిస్‌లు కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

గ్రూప్-1లో పాక్-భారత్:
టీ20 ప్రపంచకప్‌లోని గ్రూప్-1లో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫికేషన్ రౌండ్ గ్రూప్-ఎలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఒమన్, న్యూగినియా జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్-ఎ, గ్రూప్- బి జట్ల మధ్య అక్టోబరు 17 నుంచి 22 వరకూ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరగనుండగా.. టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-12 ( గ్రూప్-1, గ్రూప్-2) మ్యాచ్‌లకి అర్హత సాధించనున్నాయి. పాకిస్తాన్, న్యూజీలాండ్ లాంటి పటిష్ట జట్లను ఓడిస్తే.. భారత్ సునాయాసంగా సెమీస్ చేరనుంది.

పాకిస్థాన్ టీ20 జట్టు:
బాబర్ అజామ్(కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరిస్ రఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), మహ్మద్ వసీమ్ జూ, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, సోహైబ్ మక్సూద్.
రిజర్వ్ ఆటగాళ్లు: ఖుష్దిల్ షా, షహ్నవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్.

పాకిస్తాన్ టీ20 జట్టు (గతంలో):
బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్.
రిజర్వ్ ఆటగాళ్లు: ఫకర్ జమాన్, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications