'దేశ చరిత్రలోనే ఇంత చెత్త జట్టును నేనిప్పటివరకూ చూడలేదు'

హైదరాబాద్: సెమీఫైనల్ వరకు పోరాడిన అండర్ 19 పాకిస్థాన్ జట్టు భారత్‌తో తలపడి ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో కేవలం 69పరుగులకే పాకిస్థాన్ జట్టు ఆలౌట్ అవడంతో భారత్ 203 పరుగులతో ఘన విజయాన్ని సాధించింది. ఈ ఓటమిపై పాక్‌లో జట్టుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
ఆదివారం పాక్ జట్టు మేనేజర్ పాకిస్థాన్ జట్టును విమర్శిస్తూనే భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ''273 పరుగుల లక్ష్య చేధన పెద్ద విషయం ఏం కాదు. పైగా పాక్ జట్టు చాలా బలంగా ఉంది. ఈ క్రమంలో ఇంత తక్కువ స్కోర్‌కు అవుట్ కావటం నమ్మశక్యం కావటం లేదు.' అని సందేహాన్ని వ్యక్తం చేశాడు.
"ఆట జరిగిన తీరును గమనిస్తే పాక్ ప్లేయర్లపై 'మ్యాజిక్ స్పెల్' బాగా పని చేసిందనిపిస్తోంది. ఆ ఓవర్లలో భారత బౌలర్లు వేసిన బంతులు టర్న్ కావటంతో ఏం జరుగుతుందో అర్థంకాక ఆటగాళ్లు గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఒత్తిడికి గురై వికెట్లను చేజార్చుకున్నారు." అని నదీమ్ వ్యాఖ్యానించాడు. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ రూపం కళ్లముందు కదలాడుతుందంటూ కొనియాడాడు.
అయితే నాదిమ్ ప్రకటనపై పీసీబీ అసహనం వ్యక్తం చేసింది. దీంతో వెనక్కి తగ్గిన ఆయన ఈసారి ఆటగాళ్ల వైఫల్యాన్ని ఎండగట్టారు. పాక్ చరిత్రలో ఇంత చెత్త అండర్ 19 టీమ్‌ను చూడలేదని వారంతా చాలా అంశాల్లో వెనకబడి ఉన్నారని వ్యాఖ్యానించి ఈసారి ఆటగాళ్ల నుంచి ఆయన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications