ఆ మూడు వన్డేల్లోనూ ఓటమే.. పాకిస్తాన్‌కు కలిసిరాని ఇమామ్, ఫఖర్, బాబర్ భారీ శతకాలు!!

హైదరాబాద్: ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్తాన్ వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం కారణంగా మూడు వన్డేల సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. కరోనా వైరస్ కేసులు నమోదవంతో ప్రధాన ఆటగాళ్లంతా క్వారంటైన్‌లోకి వెళ్లడంతో.. ఇంగ్లండ్ బీ టీమ్‌తో బరిలోకి దిగింది. ఏకంగా 9 మంది కొత్త ఆటగాళ్లు ఆ జట్టులోకి వచ్చారు. అయినా పటిష్ట పాకిస్తాన్ కనీస పోటీ ఇవ్వకుండానే ఇంగ్లీష్ బీ టీమ్‌పై ఓడిపోయింది. చివరి వన్డేలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం భారీ (158) సెంచరీ చేసినా లాభం లేకపోయింది. అంతకుముందు కూడా ఇలానే జరిగింది. పాక్ స్టార్ ఆటగాళ్లు ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జామన్, బాబర్ ఆజంలు చేసిన భారీ సెంచరీలు ఆ జట్టుకు ఏమాత్రం కలిసిరానట్టున్నాయి.

ఇమామ్ ఉల్ హక్ 151:
పాకిస్తాన్ జట్టు 2019 ఏప్రిల్-మేలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఐదు వన్డేల సిరీసులో భాగంగా మే 14న బ్రిస్టల్ వేదికగా మూడో వన్డే జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఫఖర్ జామన్ (2), బాబర్ ఆజం (15)లు విఫలమయినా.. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ భారీ సెంచరీ (151; 131 బంతుల్లో 14x4, 1x 6) చేశాడు. హరిస్ సోహైల్ (41), ఆసిఫ్ అలీ (52)ల అండతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి భారీ స్కోర్ అందించాడు. ఛేదనలో ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ జాసన్ రాయ్ (76), జానీ బెయిరిస్టో (128), జో రూట్ (43), బెన్ స్టోక్స్ (37), మొయిన్ అలీ (46)లు రాణించడంతో 44.5 ఓవర్లలోనే 359 రన్స్ చేసింది. దీంతో ఫఖర్ జామన్ భారీ శతకం వృధా అయింది.

ఫఖర్ జామన్ 193:
2021 ఏప్రిల్‌లో మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది పాకిస్తాన్. జోహనెస్‌బర్గ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (92; 102 బంతుల్లో 10x4, 1x 6), కెప్టెన్ తెంబా బవుమా (80; 86 బంతుల్లో 9x4), డసెన్ (60), డేవిడ్ మిల్లర్ (50) హాఫ్ సెంచరీలు బాదాడు. లక్ష ఛేదనలో ఫఖర్ జామన్ తృటిలో డబుల్ సెంచరీ (193; 155 బంతుల్లో 18x4, 10x 6) కోల్పోయాడు. అతడికి మరెవరూ సహకరించకపోవడంతో పాక్ ఓటమిపాలైంది. పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 324 రన్స్ చేసింది.

బాబర్ ఆజం 158:
2021లో మరోసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది పాక్. మూడు మ్యాచుల సిరీసులో భాగంగా జులై 13న జరిగిన చివరి వన్డేలో పాక్ ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం (158: 139 బంతుల్లో 14x4, 4x6) సెంచరీ బాదడంతో 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (56: 73 బంతుల్లో 7x4), రిజ్వాన్ (74: 58 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీలు చేశారు. ఛేదనలో ఇంగ్లండ్ టీమ్‌కి ఓపెనర్ ఫిలిప్ (37: 22 బంతుల్లో 7x4) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. జేమ్స్ విన్స్ (102: 95 బంతుల్లో 11x4) సెంచరీ బాదగా.. లావిస్ గ్రేగరీ (77: 69 బంతుల్లో 6x4, 3x6) చెలరేగిపోయాడు. దాంతో 48 ఓవర్లలోనే ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆజం చేసిన భారీ సెంచరీ వెస్ట్ అయింది. మొత్తానికి పాక్ స్టార్ ఆటగాళ్లు భారీ సెంచరీలు చేసినప్పుడల్లా పాక్ ఓడిపోతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications