For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షెహజాద్ సెంచరీ మిస్, పాక్ 339: చేతులెత్తేసిన యుఏఈ

నేపియర్: ప్రపంచకప్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచులో యుఏఈపై పాకిస్థాన్ సునాయాస విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన భారీ లక్ష్యం 340 పరుగులను ఛేదించలేక చేతులెత్తేసింది యుఏఈ. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 210 పరుగులకే పరిమితమైంది. దీంతో 129 పరుగుల తేడాతో యుఏఈ ఓటమిపాలైంది.

షేమన్ అన్వర్ 62, ఖుర్రమ్ ఖాన్ 43, అమ్జద్ జావేద్ 40, స్వప్నిల్ పాటిల్‌ 33 పరుగులతో రాణించారు. అమ్జద్ అలీ 14, బెరెంజర్ 2, కృష్ణ చంద్రన్ 0, రోహన్ ముస్తఫా 0 పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ బౌలర్లలో సోహెల్ ఖాన్, షాహిద్ అఫ్రిదీ, రియాజ్ రెండేసి వికెట్లు తీయగా, రోహత్ అలీ, మక్సూద్ చెరో వికెట్ పడగొట్టారు.

పాక్ బౌలర్లలో సోహెల్ ఖాన్, షాహిద్ అఫ్రిదీ రెండేసి వికెట్లు తీయగా, రోహత్ అలీ, మక్సూద్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 339 పరుగులు చేసింది. యూఏఈ ముందు 340 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Pakistan lose Ahmed Shehzad, Haris Sohail in a hurry against UAE

10 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన పాక్‌ను అహ్మద్ షెహజాద్(93), హారిస్ సొహైల్(70) అర్థ శతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 166 బంతుల్లో 150 పరుగులు జోడించారు. వీరు అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మక్సూద్, మిస్బా బ్యాట్ ఝుళిపించారు. మక్సూద్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. మిస్బా 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. చివర్లో ఆఫ్రిది చెలరేగాడు. కేవలం 7 బంతుల్లో 2 సిక్సర్లు, ఫోర్ తో 21 పరుగులు చేశాడు. రియాజ్ 6 పరుగులతో అజేయంగా నిలిచాడు.

కాగా, యుఏఈ బౌలర్లలో అద్భుతంగా రాణించిన గురుగ్ 4 వికెట్లు తీయగా, నవీద్ ఒక వికెట్ పడగొట్టారు. అహ్మద్ షెహజాద్ రనౌటయ్యాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+