
ఛారిటీ మ్యాచ్‌లో..
తాజాగా ఇంగ్లాండ్‌లో నిర్వహించిన ఓ ఛారిటీ మ్యాచ్‌లో తన సత్తా చాటాడు వసీం అక్రమ్. అతను సంధించిన యార్కర్‌కు ఎదురులేకుండా పోయింది. బ్యాటర్.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కొద్దిరోజుల కిందటే కన్నుమూసిన ఆస్ట్రేలియా లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేర్ వార్న్ జ్ఞాపకార్థం నిర్వహించిన ఛారిటీ మ్యాచ్ ఇది. మాజీ స్టార్ క్రికెటర్లు రెండు జట్లుగా తలపడ్డారు. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా, ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ మైకెల్ అథర్టన్ ఈ మ్యాచ్ ఆడిన వారిలో ఉన్నారు.
ఎదురులేని యార్కర్..
మైక్ అథర్టన్ బ్యాటింగ్ చేస్తోన్నప్పుడు వసీం అక్రమ్ సంధించిన ఓ పర్ఫెక్ట్ యార్కర్‌కు వికెట్లు గాల్లోకి లేచాయి. రౌండ్ ద వికెట్‌గా, తక్కువ రనప్‌తో విసిరిన ఆ బంతిని ఎదుర్కొన లేకపోయాడు అథర్టన్. వికెట్ నేలకూలిన వెంటనే వసీం భాయ్ తనదైన స్టైల్‌లో రెండు చేతులు గాల్లో లేపి.. సెలెబ్రేట్ చేసుకున్నాడు. అథర్టన్ కూడా అతన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

900లకు పైగా వికెట్లు..
క్లైవ్ లాయిడ్ అంపైర్‌గా వ్యవహరించాడు. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో బ్రియాన్ లారా..నిల్చొని ఉండటం చూడొచ్చు. 1984 నుంచి 2003 వరకు పాకిస్తాన్ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహించాడు వసీం అక్రమ్. 356 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. 1992లో ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో సభ్యుడు కూడా. 104 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 414, వన్డేల్లో 503 వికెట్లు నేలకూల్చాడు. బ్యాటర్‌గానూ సత్తా చాటాడు. టెస్టుల్లో 2,898 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, మూడు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలు ఉన్నాయి.
31 సార్లు అయిదు వికెట్లు..
వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆరు అర్ధసెంచరీలు నమోదు చేశాడు. మొత్తంగా 3,717 పరుగులు చేశాడు. తన చిట్టచివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో అయిదు వికెట్లను పడగొట్టాడు వసీం అక్రమ్. అయిదు వికెట్లతో తన అంతర్జాతీయ కేరీర్‌కు ముగింపు పలికిన మరో ఫాస్ట్ బౌలర్ లేడు. కేరీర్ మొత్తం మీద 31సార్లు అయిదు వికెట్లను పడగొట్టాడంటే వసీం బౌలింగ్.. ప్రత్యర్థి బ్యాటర్లను ఏ రేంజ్‌లో బెంబేలెత్తించిందో అర్థం చేసుకోవచ్చు.

అథర్టన్ కూడా..
మైక్ అథర్టన్ కూడా ఆర్డినరీ బ్యాటర్ కాదు. 1989 నుంచి 2001 వరకు ఇంగ్లాండ్ తరఫున 54 వన్డే ఇంటర్నేషనల్స్, 115 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 7,728, టెస్టుల్లో 1,791 పరుగులు చేశాడు. అతి చిన్న వయస్సులో ఇంగ్లాండ్ కేప్టెన్సీ పగ్గాలను అందుకున్న ప్లేయర్.. అథర్టన్. 25 ఏళ్ల వయస్సులో కేప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. అతని సారథ్యంలో ఇంగ్లాండ్ జట్టు 54 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది.


Click it and Unblock the Notifications












