For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సూర్యకుమార్ యాదవ్ గ్రహాంతరవాసే.. పాక్ లెజెండ్ వైరల్ కామెంట్స్

 Pakistan Legend says Suryakumar Yadav is from a different planet

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లలో టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఒకడు. సౌతాఫ్రికా, జింబాబ్వే మ్యాచుల్లో అతను అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడాడు. సఫారీల చేతుల్లో టీమిండియా ఓటమి చవి చూసినా కూడా.. జింబాబ్వేపై గెలిచి ప్రపంచకప్‌లో గ్రూప్-2లో టేబుల్ టాపర్‌గా నిలిచింది. దీంతో అప్పటికే సెమీస్ చేరిన టీమిండియా.. సెమీస్‌లో ఎదుర్కొనే ప్రత్యర్థి ఎవరో ఖరారైంది.

జింబాబ్వే ఇన్నింగ్స్ అదుర్స్..

జింబాబ్వే ఇన్నింగ్స్ అదుర్స్..

సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ విజయంతో నేరుగా సెమీస్ చేరిన భారత జట్టు.. జింబాబ్వేతో మ్యాచ్‌లో గెలిచి గ్రూప్-2 టాపర్‌గా నిలవాలని అనుకుంది. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ ఎవరూ మంచి స్కోరు చెయ్యలేదు. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. కానీ భారత జట్టుకు భారీ స్కోరు అందించిన ఆటగాడు మాత్రం సూర్యకుమార్ యాదవే.. కేవలం 25 బంతుల్లో 61 పరుగులతో అజేయంగా నిలిచిన అతను భారత్‌కు భారీ స్కోరు అందించాడు.

కచ్చితంగా గ్రహాంతరవాసే..

కచ్చితంగా గ్రహాంతరవాసే..

ఈ ఏడాది ఆరంభం నుంచి సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్.. జింబాబ్వే మ్యాచ్‌లో మైదానం నలువైపులా షాట్లు ఆడుతూ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆరో స్టంప్ మీదకు వేసిన ఒక ఫుల్‌టాస్ డెలివరీని ఫైన్ లెగ్ దిశగా స్కూప్ షాట్ ఆడాడు. ఆ షాట్ రీప్లేను చూసిన పాక్ మాజీ లెజెండ్ వసీం అక్రమ్ ఆశ్చర్యపోయాడు. సూర్యకుమార్‌ను చూస్తుంటే అతను కచ్చితంగా వేరే గ్రహానికి చెందిన వాడని అనిపిస్తుందని కామెంట్ చేశాడు.

అవుట్ చేయడం ఎలా?

అవుట్ చేయడం ఎలా?

సూర్యకుమార్ యాదవ్ మిగతా వారితో పోలిస్తే చాలా విభిన్నంగా ఉన్నాడన్న వసీం అక్రమ్.. ఒక్క జింబాబ్వే మీదనే కాదు ప్రపంచంలోని అత్యుత్తమ బౌలింగ్ బృందాలపై కూడా అతని ఆట చూడటం చాలా బాగుంటుందని చెప్పాడు. ఇంత సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యను ఎలా అవుట్ చెయ్యాలి? అనే ప్రశ్నకు కూడా ఈ లెజెండరీ పేసర్ సమాధానం ఇచ్చాడు.

పాక్ బౌలర్ల ప్లాన్..

పాక్ బౌలర్ల ప్లాన్..

'వన్డే, టెస్టుల్లో అయితే ఏదో ఒక ప్లాన్ వేసి అతన్ని బుట్టలో వేయొచ్చు. కానీ టీ20ల్లో బౌలర్‌కు అంత టైం ఉండదు. ఈ ఫార్మాట్‌లో బౌలర్లే బ్యాక్‌ఫుట్‌లో ఉంటారు. ఇలాంటి ఫామ్‌లో ఉన్న వాళ్లకు బౌలింగ్ చేయడం చాలా కష్టం. గత మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్లు అతనికి బాగా బౌలింగ్ చేశారని అనుకుంటున్నా. వాళ్లు సూర్యను షార్ట్ బాల్స్‌తో విపరీతంగా ఇబ్బంది పెట్టారు. అతని మీద అదొక్కటే మార్గం అనుకుంటున్నా' అని అక్రమ్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, November 7, 2022, 11:13 [IST]
Other articles published on Nov 7, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+