Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇలా పోల్చడం వేస్ట్.. కోహ్లీ దరిదాపుల్లో కూడా బాబర్ లేడు: పాక్ దిగ్గజం

Pakistan legend says Babar is nowhere near Virat Kohli in this aspect

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో బెస్ట్ బ్యాటర్లు ఎవరు అని అడిగితే.. చాలా మంది విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్ మధ్య పోలిక తెస్తారు. కోహ్లీ ఇప్పటికే తను వరల్డ్ క్లాస్ ఆటగాడినని నిరూపించుకున్నాడు. చాలా కాలంగా అద్భుతంగా రాణిస్తూ టీమిండియాను ముందుండి నడిపిస్తున్నాడు. బాబర్ ఇప్పుడిప్పుడే సత్తా చాటుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదిస్తున్నాడు. కానీ భారత్, పాక్ ఫ్యాన్స్ మాత్రం వీళ్లిద్దరిలో తమ వాడు గొప్పంటే, తమ వాడు గొప్ప అని గొడవ పడుతూ ఉంటారు.

ఈ విషయంపై పాక్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ పెదవి విప్పాడు. వీళ్లిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లే అన్ని రజాక్.. ఒక విషయంలో మాత్రం కోహ్లీ సమీపంలో కూడా బాబర్ లేడని తేల్చి చెప్పాడు. 'విరాట్ ఫెంటాస్టిక్ ప్లేయర్. అతను తన జట్టు మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లే విధానం చాలా బాగుంటుంది. ఎప్పుడూ పాజిటివ్ ఇంటెంట్‌తోనే ఆడతాడు. తన స్కిల్స్‌ను చక్కగా యూజ్ చేసుకొని జట్టుకు విజయాలు అందిస్తాడు' అంటూ కోహ్లీని రజాక్ మెచ్చుకున్నాడు.

అదే సమయంలో కోహ్లీని ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలిపే ప్రధాన అంశం మాత్రం అతని ఫిట్‌నెస్ అని రజాక్ చెప్పాడు. 'బాబర్ ఆజమ్ ఫిట్‌నెస్.. కోహ్లీ స్థాయిలో ఉండదు. అతను తన ఫిట్‌నెస్ మీద మరింత ఫోకస్ పెట్టి పని చేయాలి. పాకిస్తాన్‌లో బాబర్ నెంబర్ వన్ ప్లేయర్. ప్రస్తుతం ఏ ఫార్మాట్ అయినా బాబర్ నెంబర్ వన్ ప్లేయరే. చాలా నిలకడగా రాణిస్తూ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇప్పుడు ప్రతి దేశంలోనూ విరాట్, బాబర్ వంటి ఆటగాళ్లు కనీసం ఒకరైనా ఉన్నారు' అని రజాక్ అన్నాడు.

అయితే వీళ్లిద్దరి మధ్య అసలు పోలిక తీసుకురావడమే తప్పని రజాక్ చెప్పాడు. అలా పోలికలు తీసుకురాకపోవడమే మంచిదని హితబోధ చేశాడు. 'వాళ్లిద్దరినీ పోల్చి చూడాల్సిన అవసరం ఏముంది. కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్.. వీళ్లిద్దరిలో ఎవరు బెస్ట్ అన్నట్లే ఉంటుందీ ప్రశ్న. ఇలా పోల్చడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. భారత్‌లో కోహ్లీ మంచి ఆటగాడు. అలాగే పాక్‌లో బాబర్. కోహ్లీ ప్రపంచ స్థాయి ఆటగాడైతే బాబర్ కూడా అంతే. ఒక్క ఫిట్‌నెస్ విషయంలోనే బాబర్ కన్నా కోహ్లీ చాలా ముందున్నాడు' అని వివరించాడు.

Story first published: Tuesday, March 28, 2023, 12:44 [IST]
Other articles published on Mar 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+