Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా కప్: భారత్‌తో తలపడే పాకిస్థాన్ జట్టు ఇదే

Asia Cup 2018: Selectors Fix The Counter Team To India
Pakistan leave unfit Hafeez and Wasim out of Asia Cup squad

హైదరాబాద్: ఆసియా కప్‌లో పాల్గొనే పాకిస్థాన్ జట్టుని సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు. జట్టు ఎంపికలో పాక్ సెలక్టర్లు ఫిట్‌నెస్, ఫామ్‌కి పెద్దపీట వేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సెప్టెంబర్ 15 నుంచి జరగనున్న ఆసియా కప్ కోసం 16 మందితో కూడిన జట్టుని ఎంపిక చేశారు.

సీనియర్ క్రికెటర్లు మహ్మద్ హఫీజ్, ఇమాద్ వసీమ్‌పై సెలక్టర్లు వేటు వేశారు. ఆసియా కప్ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. సెప్టెంబర్ 16న క్వాలిఫయర్ జట్టుతో తొలి మ్యాచ్‌ని పాకిస్థాన్ జట్టు ఆడనుంది. ఆ తర్వాత టీమిండియాతో సెప్టెంబర్ 19న భారత్‌తో పాక్ తలపడనుంది.

ఏడాది తర్వాత భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్

ఏడాది తర్వాత భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్

దాదాపు ఏడాది తర్వాత మళ్లీ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో టోర్నీలోనే ఈ మ్యాచ్‌ని హై ఓల్టేజ్ మ్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు. దీంతో పాక్ సెలక్టర్లు సుదీర్ఘ చర్చ అనంతరం జట్టుని ఎంపిక చేశారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన షాన్ మసూద్‌ తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్నాడు.

కెప్టెన్ కోహ్లీకి విశ్రాంతి

కెప్టెన్ కోహ్లీకి విశ్రాంతి

ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, ఒక క్వాలిఫయర్ జట్టు పోటీపడనున్నాయి. ఆసియా కప్ అనంతరం వెస్టిండిస్, ఆస్ట్రేలియా పర్యటనలను దృష్టిలో పెట్టుకుని వర్క్ లోడ్ కారణంగా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ టోర్నీ నుంచి భారత సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.

పాకిస్థాన్ జట్టు:

సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, షాన్ మసూద్, బాబర్ అజామ్, షోయబ్ మాలిక్, అసిఫ్ అలీ, హారీస్ సోహాలి, సదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, అష్రప్, హసన్ అలీ, మహ్మద్ అమీర్, జునైద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది

Story first published: Wednesday, September 5, 2018, 11:08 [IST]
Other articles published on Sep 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+