For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK Vs BAN: స్పిన్నర్ లేకుండానే టెస్ట్ కు సిద్దమవుతోన్న పాక్..

బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు పాకిస్థాన్ సిద్ధమవుతోంది. వచ్చే వారం రావల్పిండిలో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండానే పాకిస్థాన్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో తలపడనుంది. ఈ సిరీస్ పాక్ సీమర్స్ నే నమ్ముకుంది. నసీమ్ షా టెస్ట్ జట్టుకు తిరిగి రావడంతో షాహీన్ షా అఫ్రిది కూడా పాక్ స్పీడ్ బౌలింగ్ కు బలాన్ని చేకుర్చనున్నారు. ఖుర్రం షెహజాద్, మీర్ హమ్జా, అమీర్ జమాల్ ఆస్ట్రేలియాతో టెస్ట్ లో రాణించారు. అయితే అమీర్ జమాల్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం లేదు.

ఆస్ట్రేలియాపై జమాల్ 18 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాపై అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. కానీ అతను గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. టెస్ట్ సిరీస్‌కి ఒకరోజు ముందు ఆగస్టు 20న ఇస్లామాబాద్‌లో బంగ్లాదేశ్ Aతో జరిగే వార్మప్ మ్యాచ్ లో షాహీన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. పీసీబీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్, టాప్-ఆర్డర్ బ్యాటర్ కమ్రాన్ గులామ్‌ను మొదటి టెస్టుకు ఎంపిక చేయలేదు.

Pakistan is ready for the Test against Bangladesh without a specialist spinner

"ఆగస్టు 21న రావల్పిండి క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగే మొదటి ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఆల్-పేస్ అటాక్‌తో వెళ్లాలని సెలక్టర్లు నిర్ణయించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం" అని పీసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. మొదటగా 17 మందితో జట్టును ఎంపిక చేసిన పీసీబీ ఆ తర్వాత 15 మంది ఆటగాళ్లకు కుదించింది. పాకిస్థాన్ షహీన్ జట్టులో భాగమైన మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, నసీమ్ షా, సైమ్ అయూబ్, సర్ఫరాజ్ అహ్మద్, సౌద్ షకీల్ ఇప్పుడు టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నారు.

పాకిస్థాన్ షాహీన్స్ జట్టు : కమ్రాన్ గులామ్ (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అలీ జర్యాబ్, గులాం ముదస్సర్, ఇమామ్-ఉల్-హక్, మెహ్రాన్ ముంతాజ్, మహ్మద్ అవైస్ అన్వర్, నియాజ్ ఖాన్, ఖాసిం అక్రమ్, రోహైల్ నజీర్ (వికెట్- కీపర్), సాద్ బేగ్ (వికెట్-కీపర్), సాద్ ఖాన్, షరూన్ సిరాజ్, ఉమర్ అమీన్.

Story first published: Sunday, August 18, 2024, 12:30 [IST]
Other articles published on Aug 18, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+