Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్ర‌పంచ‌క‌ప్ 2019: ఏ టీమ్ ఎన్ని క్యాచ్‌ల‌ను జార‌విడిచిందంటే..? టాప్‌లో పాక్‌!

ICC Cricket World Cup 2019 : Team Wise Dropped Catches In World Cup 2019 ! || Oneindia Telugu
Pakistan have now dropped 14 catches in this World Cup

లండ‌న్‌: ఇంగ్లండ్ వేదిక‌గా ప్ర‌పంచ‌క‌ప్ మెగా టోర్న‌మెంట్ రంజుగా కొన‌సాగుతోంది. మ్యాచ్ మ్యాచ్‌కూ సంచ‌ల‌నాలు న‌మోదువుతున్నాయి. టైటిల్ ఫేవ‌రెట్ల‌లో ఒక‌టిగా బ‌రిలో దిగిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు.. క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌కు కూడా చేరుకోలేక‌పోయింది. బంగ్లాదేశ్ చేతిలో సైతం ఆ జ‌ట్టు ఓట‌మిని చ‌వి చూసింది. 2015 ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో సెమీ ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన ప్రొటీస్ ఈ సారి గ్రూప్ ద‌శ‌లోనే చ‌తికిల ప‌డింది. లీగ్ ద‌శ‌ను దాటి ముందుకెళ్ల‌లేక‌పోయింది. అదే స‌మ‌యంలో భార‌త్‌తో అవ‌మాన‌క‌రంగా ఓట‌మిని ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు స‌రికొత్త ఆటతీరును ప్ర‌ద‌ర్శిస్తోంది. ద‌క్షిణాఫ్రికాపై అటు బ్యాట్‌తో, ఇటు బంతితో రాణించింది. డుఫ్లెసిస్ టీమ్‌ను చిత్తుగా ఓడించింది.

నాసిర‌కం ఫీల్డింగ్‌..!
ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీలో పాకిస్తాన్ సంపూర్ణ విశ్వాసంతో ఆడిన మ్యాచ్ ఏదైనా ఉందంటే.. అది ద‌క్షిణాఫ్రికాపై మాత్ర‌మే. పాకిస్తాన్ జ‌ట్టులో అత్యంత బ‌ల‌హీనంగా చెప్పుకొనే ఫీల్డింగ్ విభాగంలో సైతం ఆ జ‌ట్టు గొప్ప‌గా రాణించింది. ద‌క్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లు సింగిల్స్ తీయ‌డానికి కూడా ఇబ్బంది ప‌డ్డారు. నిజానికి- పాకిస్తాన్ ఇప్ప‌టిదాకా ఆడిన ఆరుమ్యాచుల్లోనూ ద‌క్షిణాఫ్రికాను మిన‌హాయిస్తే.. మిగిలిన అన్నిదాంట్లో కూడా నాసిర‌కం ఫీల్డింగ్‌ను క‌న‌ప‌రిచింది. ఆరు మ్యాచుల్లో రెండింటిని మాత్ర‌మే గెలిచింది. ఓ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కాగా.. మిగిలిన మూడింట్లో ఓట‌మి పాలైంది.

ఈ ఆరు మ్యాచుల్లో 14 క్యాచులు..
పాకిస్తాన్ ఇప్ప‌టిదాకా ఆడిన ఆరు మ్యాచుల్లో అయిదు కాదు, ప‌దీ కాదు.. ఏకంగా 14 క్యాచుల‌ను జార‌విడిచింది. దీన్ని బ‌ట్టి చూస్తే ఆ జ‌ట్టు ఫీల్డింగ్ ఎంత న‌త్త‌న‌డ‌క‌న సాగిందో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ త‌రువాతి స్థానంలో ఇంగ్లండ్ నిలిచింది. ఆరు మ్యాచుల్లో 12 క్యాచ్‌ల‌ను ఇంగ్లిస్ జ‌ట్టు జార‌విడిచింది. న్యూజీలాండ్-9, ద‌క్షిణాఫ్రికా-8, వెస్టిండీస్‌-6 క్యాచ్‌ల‌ను జార విడిచాయి. ఆస్ట్రేలియా-4, బంగ్లాదేశ్‌-4, శ్రీలంక‌-3, ఆఫ్ఘ‌నిస్తాన్‌-2 క్యాచ్‌ల‌ను జార‌విడిచి బ్యాట్స్‌మెన్‌కు జీవ‌నాన్ని ప్ర‌సాదించాయి. ఇక టీమిండియా ఒకే ఒక్క క్యాచ్‌ను జార‌విడిచింది.

Story first published: Tuesday, June 25, 2019, 14:34 [IST]
Other articles published on Jun 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+