
హైదరాబాద్: బర్మింగ్ హామ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ బౌలర్లు విజృంభించడంతో కివీస్ 97 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు 35 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
క్రీజులో జిమ్మీ నీషమ్(39), కోలిన్ డీ గ్రాండ్ హోమ్(29) పరుగులతో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు పాక్ బౌలర్లు ఆరంభం నుంచే చుక్కులు చూపించారు. దీంతో న్యూజిలాండ్ 46 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
ఓపెనర్ మార్టిన్ గప్టిల్(4) తొలి ఓవర్ తొలి బంతికే పెవిలియన్‌కు చేర్చాడు మహ్మద్ ఆమీర్. అనంతరం మరో లెఫ్టార్మ్ పేసర్ షాహిన్ ఆఫ్రిది వరుసగా కోలిన్ మున్రో(12), రాస్ టేలర్(3), టామ్ లాథమ్(1)లను పెవిలియనకు పంపించి న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగతా మూడు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కివీస్‌తో మ్యాచ్ గెలవాల్సిందే. కాగా, బర్మింగ్‌హామ్ మైదానంలో ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో టాస్ ఆలస్యంగా వేశారు. దీంతో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.