T20 World Cup 2022: పొట్టలేకుని ఉంటే కష్టమే.. పాక్ జట్టుపై మిస్బా విసుర్లు..

భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా చూస్తుంది. ముఖ్యంగా ఇండియన్,పాక్ అభిమానులు టీవీలకు అతక్కుపోతారు. మొన్న జరిగిన ఆసియా కప్ లో రెండు సార్లు తలపడిన మ్యాచ్ చాలా ఉత్కంఠగా జరిగాయి. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ నెల 23న భారత్, పాక్ మరోసారి తలపడనున్నాయి.
చిత్తుగా ఓడిన పాక్
ఈ మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ పాక్ జట్టుపై విమర్శలు చేశారు. పాకిస్థాన్
మొదటి వార్మప్ గేమ్‌లో ఇంగ్లాండ్‌పై ఓడిపోయింది. జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ ధాటికి పాకిస్థాన్ బౌలర్లు తేలిపోయారు. దీనిపై మిసాబ్-ఉల్-హక్ స్పందించాడు. పాక్ ఆటగాళ్ల ఫిట్ నెస్ పై మండిపడ్డాడు.
పొట్టలు
"క్లియర్ కట్, ఫిట్‌నెస్ సమస్యలు కనిపిస్తున్నాయి. నేను, షోయబ్ మాలిక్, యూనిస్ ఖాన్ వంటి ఆటగాళ్లు ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టేవారు. కానీ ఇప్పుడు.. ఆటగాళ్ల పొట్టలు బయటికి కనబడుతున్నాయి. వాళ్లు ఫీల్డ్‌లో చురుకుగా కదలలేకపోతున్నారు. "అని మిస్బా పాకిస్తాన్‌లోని ఒక టీవీ షోలో అన్నారు. కార్ నాలుగుసార్లు, నేను ఒకసారి కోచ్ పదవులను వదిలేసిన సంగతి తెలిసిందేనని గుర్తు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications