టీమిండియా చేతిలో చెత్తగా ఓడటాన్ని జీర్ణించుకోలేకపోతున్న పాక్ ఫ్యాన్స్

హైదరాబాద్: ప్రపంచకప్‌లో టీమిండియా మరోసారి సత్తా చాటింది. ఆటగాళ్లు మారినా, మైదానాలు మారినా ప్రపంచకప్‌లో తమను ఓడించే సత్తా పాకిస్థాన్‍కు లేదని భారత ఆటగాళ్లు మరోసారి నిరూపించారు. ఆదివారం మాంచెస్టర్ వేదికగా జరిగిన హై ఓల్డేజ్ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ విజయంతో ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై తమకు ఎదురులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. ఏకంగా ఏడోసారి ఓడించి ప్రపంచకప్‌లో పాక్‌పై తన విజయ పరంపరను భారత్ కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అనంతరం 337 పరుగుల లక్ష్య చేధనలో పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను 40 ఓవర్లకు కుదించారు. దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్థాన్‌కు 40 ఓవర్లలో 302 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే, పాకిస్థాన్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేసింది.
ఈ విజయంతో భారత్ వరుసగా ఏడో సారి ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన రోహిత్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. భారత్ చేతిలో పాక్ చెత్తగా ఓడటంతో సోషల్ మీడియాలో ఆ జట్టుని తెగ ఆడేసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో పాకిస్థాన్ జట్టుపై వైరల్ అవుతోన్న మీమ్స్ మీకోసం ప్రత్యేకంగా...:
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications