'పాక్ కెప్టెన్‌కు టాలెంటే కాదు.. బుర్ర కూడా లేదు'


న్యూ ఢిల్లీ: ఆసియా కప్ మొదలవడానికి కొద్ది రోజుల ముందే భారత్Xపాక్‌ల గురించి చర్చ మొదలైంది. హోరాహోరీ పోరాటం జరగనుందని భావించిన అభిమానుందరికీ నిరుత్సాహమే మిగిలింది. ఈ పోరాటంలో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను రెండోసార్లు చిత్తుగా ఓడించింది. ఇలా టీమిండియా చేతిలో పాక్ ఓడిపోవడం ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. జట్టు పేలవ ప్రదర్శనపై మండిపడుతున్నారు.
ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు నిర్ణయాలతో జట్టు ఓటమికి కారణమయ్యాడని దుమ్మెత్తిపోస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలనే కెప్టెన్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పాక్ మ్యాచ్ గెలవాలి...సర్ఫరాజ్‌పై
‘టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ ఈ మ్యాచ్ గెలవాలి. లేకపోతే సర్ఫరాజ్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతాయి' అని మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు.
ఎలాంటి ప్రతిభ లేదు. ఫామ్ కూడా
‘ఆసియా కప్‌లో ఎలాంటి ఫలితం వచ్చినప్పటికీ.. సర్ఫరాజ్ ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైంది. అతనికి ఎలాంటి ప్రతిభ లేదు. ఫామ్ కూడా లేదు. అతను క్రికెట్‌కు సరిపోడు'
సర్ఫరాజ్ ఓవర్‌రేటెడ్ ప్లేయర్
'సర్ఫరాజ్ ఓవర్‌రేటెడ్ ప్లేయర్. పాక్ జట్టుకు గతంలో ఎంపిక కూడా కాలేదు.'
సోమరి కెప్టెన్లలో సర్ఫరాజ్
'అత్యంత సోమరి కెప్టెన్లలో సర్ఫరాజ్ ఒకరు. అతని కెప్టెన్సీని ఇక మేం అంగీకరించం'
ఫైనల్స్‌లో సర్ఫరాజ్‌ను చూడాలనుకోవడం
‘భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది అత్యంత అవమానకర ఓటమి. ఫైనల్స్‌లో సర్ఫరాజ్‌ను చూడాలనుకోవడం లేదు.'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications