అఫ్రిదీ స్వార్థపరుడు.. ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడు

పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ స్వార్థపరుడని.. అనేక మంది యువ క్రికెటర్ల కెరీర్‌ను నాశనం చేశాడని ఆ జట్టు మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఫర్హాత్ (36) విమర్శలు చేశాడు. అఫ్రిదీ.. 'గేమ్ చేంజర్' అనే తన ఆటోబయోగ్రఫీలో కశ్మీర్ అంశం, 2010 స్పాట్ ఫిక్సింగ్, తన వయసు తదితర విషయాలను వెల్లడించాడు.

ఘాటుగానే స్పందించిన గంభీర్:
ఈ ఆటోబయోగ్రఫీ విడుదలైనప్పటి నుంచి షాహిద్ అఫ్రిదీ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. గేమ్ చేంజర్‌లో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసాడు. అందుకు ధీటుగా గంభీర్ కూడా ఘాటుగానే స్పందించాడు. 'అఫ్రిదీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. ఆయన్ను పిచ్చాస్పత్రిలో చూపించాల్సిందే. భారత్‌కు వస్తే స్వయంగా తానే మానసిక నిపుణుడి వద్దకు తీసుకుపోతా' అని గంభీర్ అన్నారు. గంభీర్‌తో పాటు జావెద్ మియాందాద్, వకార్ యూనిస్ వంటి వారిని కూడా అఫ్రిదీ వివాదాల్లోకి లాగాడు.
చాలా విషయాలు వాస్తవాలు కాదు:
అఫ్రిదీ వ్యాఖ్యలపై తాజాగా పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఫర్హాత్ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డాడు. 'షాహిద్ అఫ్రిదీ ఆటోబయోగ్రఫీలోని చాలా విషయాలు వాస్తవాలు కాదు. కొన్ని అంశాలు చదివినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. 20 ఏళ్లపాటు తన వయసుని దాచిపెట్టి ఇతరులను నిందిస్తున్నాడు. ఇది సరైన పద్దతి కాదు' అని ఇమ్రాన్ తెలిపారు.

ఎంతో మంది ఆటగాళ్ల కెరీర్‌లను నాశనం చేశాడు:
'రాజకీయవేత్త అయ్యేందుకు అఫ్రిదీకి మంచి నైపుణ్యం ఉంది. తన స్వార్ధం కోసం ఎంతో మంది యువ ఆటగాళ్ల కెరీర్‌లను నాశనం చేశాడు. అతడి చేతిలో మోసపోయిన ఆటగాళ్లు తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించాలి' అని ట్విట్టర్ వేదికగా ఇమ్రాన్ కోరాడు. ఇమ్రాన్ పాక్ తరఫున 2001-2013 వరకు 40 టెస్టులు, 58 వన్డేలు, 7 టీ20 మ్యాచులు ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications