అడిలైడ్: ప్రపంచ కప్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో భాగంగా శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియాలో సెమీస్‌లో చేరగా, పాకిస్థాన్ జట్టు ఇంటికి పయనమైంది. దీంతో మార్చి 26న జరిగే సెమీ పైనల్ మ్యాచులో టీమిండియాతో ఆసీస్ తలపడనుంది.
కాగా, 33.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్ 216 పరుగులు చేసి పాక్‌పై విజయం సాధించింది. వాట్సన్ 64, మాక్స్‌వెల్ 44 పరుగులతో అజేయంగా నిలిచి ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 24, ఫించ్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. క్లార్క్ 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం స్మిత్ 52, వాట్సన్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.
అంతకుముందు బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 49.5 ఓవర్లకు 213 పరుగులు చేసి అలౌటైంది. 10 వికెట్గా ఆదిల్(15) వెనుదిరిగాడు. మ్యాచ్ ఆరంభం నుంచి తడబడిన పాక్ బ్యాట్స్‌మెన్.. మధ్యలో కొంత నిలకడగా ఆడినా.. వికెట్ నిలుపుకోవడంలో విఫలమైంది.
అంతకుముందు 195 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది. షోయబ్ మక్సూద్(29) ఏడో వికెట్గా, 8వ వికెట్గా రియాజ్(16), సోహెల్ ఖాన్(4) 9వ వికెట్గా వెనుతిరిగారు.158 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఉమర్ అక్మల్ 20, సాహీద్ అఫ్రిదీ 23 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం మక్సూద్ 18, రియాజ్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

అంతకుముందు 112 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన సోహేల్.. జాన్సన్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. 97 పరుగుల వద్ద మిస్బా ఉల్ హక్(34) వికెట్ కోల్పోయింది. 20 పరుగుల వద్ద సర్ఫరాజ్(10) వికెట్ కోల్పోయిన పాకిస్థాన్, వెంటనే 24 పరుగుల వద్ద షహజాద్(5) వికెట్ ను కోల్పోయింది. హజ్లెవుడ్ బౌలింగ్ షెహజాద్ ఔటవగా, స్టార్క్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఔటయ్యాడు.