PAK vs BAN: పాకిస్తాన్ క్రికెట్ జట్టులోని టాపార్డర్ బ్యాటర్ సైమ్ ఆయుబ్ ఆసియా కప్ 2025లో ఓ చెత్త రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో కూడా సైమ్ ఆయుబ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆసియా కప్ 2025లో సైమ్ ఆయుబ్ సున్నా పరుగులకే ఔట్ కావడం ఇది నాలుగోసారి. ఆసియా కప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ తరఫున సైమ్ ఆయుబ్ ఆడిన ఆరో మ్యాచ్ ఇది. సైమ్ ఆయుబ్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే పరుగులు చేయగలిగాడు. ప్రారంభంలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో సైమ్ ఆయుబ్ డకౌట్ అయ్యాడు.
ఆ తర్వాత సూపర్-4లో భారత్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో సైమ్ ఆయుబ్ బ్యాట్ ద్వారా పరుగుల ఖాతా తెరిచాడు. ఆ మ్యాచ్‌లో సైమ్ ఆయుబ్ 21 పరుగులు చేశాడు. సూపర్-4లోనే శ్రీలంకపై 2 పరుగులు చేశాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు. ఈ విధంగా ఆయుబ్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం 23 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

సైమ్ ఆయుబ్ పేరిట చెత్త రికార్డు
ఆసియా కప్‌లో ఈ పేలవ ప్రదర్శనతో టీ20 ఇంటర్నేషనల్స్‌లో పాకిస్తాన్ తరపున అత్యధిక సార్లు డకౌట్ అయిన రెండో బ్యాటర్‌గా సైమ్ ఆయుబ్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సైమ్ ఆయుబ్ 45 ఇన్నింగ్స్‌లలో 9వ సారి సున్నా పరుగులకే ఔట్ అయ్యాడు. ఈ విషయంలో ఉమర్ అక్మల్ (79 ఇన్నింగ్స్‌లలో 10 సార్లు డకౌట్) మొదటి స్థానంలో ఉన్నాడు. షాహిద్ అఫ్రిది (90 ఇన్నింగ్స్‌లలో 8 సార్లు డకౌట్) మూడో స్థానంలో ఉన్నాడు.
సైబ్ ఆయుబ్‌పై తన్వీర్ చేసిన అంచనాలు తలకిందులు
ఆసియా కప్ ప్రారంభానికి ముందు సైమ్ ఆయుబ్ గురించి పెద్ద పెద్ద మాటలు వినిపించాయి. పాకిస్తాన్ క్రికెట్ విశ్లేషకులు సైమ్ ఆయుబ్ ను భారత బ్యాటర్లైన అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ వంటి వారితో పోల్చారు. మరింత దారుణంగా.. మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ఒక అడుగు ముందుకేసి, సైమ్ ఆయుబ్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొడతాడని జోస్యం చెప్పాడు. కానీ సైమ్ గురించి చేసిన ఆ అంచనాలన్నీ తలకిందులైపోయాయి. ఆసియా కప్ తర్వాత అతడు పాకిస్థాన్ జట్టు నుంచి ఉద్వాసనకు గురవుతాడేమోనని ఇప్పుడు భయం నెలకొంది.