For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే బాబర్ అజామ్‌ను తప్పించాం: పాకిస్థాన్

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు సాధించి కూడా ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వడంతో.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చేపట్టింది. ఇంగ్లండ్‌తో జరగనున్న రెండు, మూడు టెస్టులకు స్టార్ క్రికెటర్లపై వేటు వేస్తూ జట్టును ఆదివారం ప్రకటించింది. స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌ను జట్టు నుంచి తప్పించింది.

బాబర్ అజామ్‌తో పాటు అనుభవజ్ఞులైన షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, సర్ఫరాజ్ అహ్మద్‌లను పాక్ సెలక్షన్ కమిటీ జట్టు నుంచి తప్పించింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్లు హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్, కమ్రాన్ గుహ్లామ్‌లతో పాటు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అలీ, ఆఫ్ స్పిన్నర్ సజీద్ ఖాన్‌లకు అవకాశం ఇచ్చింది. షాన్ మసూద్ సారథ్యంలో 16 మందితో కూడిన జట్టును పాక్ బోర్డు ప్రకటించింది.

Pakistan Drop Babar Shaheen and Naseem for Next Two Tests Due to Form and Fitness Concerns PCB

అయితే బాబర్ అజామ్‌ వంటి స్టార్ ప్లేయర్లను జట్టు నుంచి తొలగించడానికి గల కారణాలను పాకిస్థాన్ క్రికెట్ సెలక్షన్ కమిటీ‌లో సభ్యుడు ఆకీబ్ జావేద్ వివరించాడు. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేసినట్లు తెలిపాడు. జట్టులో స్థానం కోల్పోవడం.. ఆటగాళ్లకు మంచిదే అని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం దొరకడంతో.. ఫిట్‌నెస్, ఆత్మవిశ్వాసం, ప్రశాంతత తిరిగి పొందడానికి సాయపడుతుందని, భవిష్యత్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తిరిగి వస్తారని పేర్కొన్నాడు.

2022 డిసెంబర్ తర్వాత నుండి బాబార్ అజామ్ టెస్టుల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ముల్తాన్ వేదికగా జరిగిన ఫ్లాట్ పిచ్‌పై కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 35 పరుగులే చేశాడు. 2022 నుంచి 10 టెస్టులు ఆడిన బాబర్ 27.73 సగటుతో 527 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 55 టెస్టుల్లో 43.92 సగటుతో 3997 పరుగులు చేశాడు. బాబర్ అజామ్ ఇటీవల పరిమిత ఓవర్ల ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

మరోవైపు స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది 2023లో పునరాగమనం తర్వాత పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. పేస్ కూడా గణనీయంగా తగ్గించి బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఏప్రిల్ గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన నసీమ్ షా కూడా అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో జట్టు నుంచి స్టార్ ప్లేయర్లను తప్పించారు.

ఇంగ్లండ్‌తో 2,3 టెస్టులకు ఎంపికైన పాకిస్థాన్ జట్టు:
షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, హసీబుల్లా (వికెట్ కీపర్), కమ్రాన్ గులామ్, మెహ్రాన్ ముంతాజ్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నోమన్ అలీ, సయిమ్ అయుబ్, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా, జాహిద్ మెహమూద్.

Story first published: Sunday, October 13, 2024, 19:02 [IST]
Other articles published on Oct 13, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+