PAK vs ENG: బాబర్ అజామ్‌తో సహా 4గురు స్టార్లపై వేటు.. జట్టును ప్రకటించిన పాక్
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగులు సాధించి కూడా ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వడంతో.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చేపట్టింది. ఇంగ్లండ్‌తో జరగనున్న రెండు, మూడు టెస్టులకు స్టార్ క్రికెటర్లపై వేటు వేస్తూ జట్టును ఆదివారం ప్రకటించింది. స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌ను జట్టు నుంచి తప్పించింది.
బాబర్ అజామ్‌తో పాటు అనుభవజ్ఞులైన షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, సర్ఫరాజ్ అహ్మద్‌లను పాక్ సెలక్షన్ కమిటీ జట్టు నుంచి తప్పించింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్లు హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్, కమ్రాన్ గుహ్లామ్‌లతో పాటు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అలీ, ఆఫ్ స్పిన్నర్ సజీద్ ఖాన్‌లకు అవకాశం ఇచ్చింది. షాన్ మసూద్ సారథ్యంలో 16 మందితో కూడిన జట్టును పాక్ బోర్డు ప్రకటించింది.

తొలి టెస్టు ఓటమి అనంతరం పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్, కోచ్ గిలెస్పీ బాబర్ అజామ్‌కు మద్దతు ఇచ్చారు. కానీ సెలక్షన్ కమిటీలో మిగిలిన సభ్యులు బాబర్ అజామ్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ కమిటీలో సభ్యులు అలీందార్, ఆఖిబ్ జావెద్, అజర్ అలీలు బాబర్‌ను తప్పించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం.
2022 డిసెంబర్ తర్వాత నుండి బాబార్ అజామ్ టెస్టుల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ముల్తాన్ వేదికగా జరిగిన ఫ్లాట్ పిచ్‌పై కూడా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 35 పరుగులే చేశాడు. 2022 నుంచి 10 టెస్టులు ఆడిన బాబర్ 27.73 సగటుతో 527 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 55 టెస్టుల్లో 43.92 సగటుతో 3997 పరుగులు చేశాడు. కాగా, బాబర్ అజామ్ ఇటీవల పరిమిత ఓవర్ల ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
Pakistan name squad for 2nd and 3rd England Tests
— PCB Media (@TheRealPCBMedia) October 13, 2024
Details here ➡️ https://t.co/vWp6IJeDkj#PAKvENG | #TestAtHome
ఇంగ్లండ్‌తో 2,3 టెస్టులకు ఎంపికైన పాకిస్థాన్ జట్టు:
షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, హసీబుల్లా (వికెట్ కీపర్), కమ్రాన్ గులామ్, మెహ్రాన్ ముంతాజ్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నోమన్ అలీ, సయిమ్ అయుబ్, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా, జాహిద్ మెహమూద్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications